విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు విజయ్ నటించిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను అందుకున్నాయి. దానితో ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కం బ్యాక్ ఇస్తాడు అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాంటి సమయంలో కింగ్డమ్ జులై 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు విడుదల అయిన రోజు మంచి టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ కి విడుదల అయిన తర్వాత మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు పడిపోయాయి.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకోవడం కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29.49 కోట్ల షేర్ కలక్షన్లు దక్కగా , 49.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో ఈ సినిమాకు 43.49 కోట్ల షేర్ ... 83.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ.కి వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా 53.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.

ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 43.49 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కడంతో ఈ మూవీ మరో 10.01 కోట్ల షేర్ కలక్షన్లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 14 వ తేదీన వార్ 2 , కూలీ సినిమాలు విడుదల కానున్నాయి. దానితో కింగ్డమ్ సినిమా చాలా థియేటర్ల నుండి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. దానితో ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకోవడం కష్టం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. దానితో విజయ్ కి కింగ్డమ్ తో కూడా నిరాశ మిగిలినట్లు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd