టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. పుష్ప పార్ట్ 1 మూవీ మంచి విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను కొల్ల గొట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక సరికొత్త రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ , అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఏకంగా 175 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. 

ఇప్పటివరకు ఈ స్థాయి పారితోషకం ఇండియన్ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా తీసుకోలేదని అల్లు అర్జున్ అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోలలో ప్రస్తుతం ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా అల్లు అర్జున్ ఇండియన్ సినీ పరిశ్రమలో పారితోషకం తీసుకుంటున్నాడు అనే వార్త వైరల్ అవుతుండడంతో ఆయన అభిమానులు అత్యంత ఆనంద పడుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో పొందుతున్న సినిమాపై ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa