ఇదిలా ఉండగా, బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమాను కూడా కన్ఫామ్ చేసేశాడని తాజా సమాచారం బయటకు వచ్చింది. ఆ సినిమా హీరోగా ఉన్నది మరెవరో కాదు, మాస్ మహారాజ రవితేజ! ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమా ‘మాస్ జాతర’ ప్రమోషన్స్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే, బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టాక్. రవితేజలోని అసలైన మాస్ ఎనర్జీని బయటకు తీసేలా బుచ్చిబాబు కథను మలచుతున్నారని, ఆయన రైటింగ్ స్టైల్‌కి తగిన భావోద్వేగాలు, పల్లె నేటివిటీ, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, “బుచ్చిబాబు రవితేజ కాంబినేషన్ అంటే అసలు ఊహించని జోడీ. ఈ ఇద్దరూ కలిస్తే తెరపై మాస్ ఎక్స్‌ప్లోషన్ తప్పదు” అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక బుచ్చిబాబు కెరీర్ విషయానికి వస్తే — ఆయన ఎంచుకునే కథల్లో పల్లె వాతావరణం, మానవ భావోద్వేగాలు, క్లాస్ టచ్‌తో కూడిన మాస్ ట్రీట్మెంట్ అన్నీ కలిసి ఉంటాయి. అందుకే రవితేజ వంటి ఎనర్జిటిక్ స్టార్‌తో ఆయన చేయబోయే సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.మొత్తానికి, రామ్ చరణ్ సినిమాతో బుచ్చిబాబు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుండగా, వెంటనే రవితేజతో తన తర్వాతి మాస్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందనే వార్తతో టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఉత్సాహంగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి