టాలీవుడ్ లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు నటి జయసుధ.  నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త . చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగు 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా నటించారు. మొదట్లో చిన్న పాత్రల్లో నటించిన జయసుధ తర్వాత ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలతో నటించారు.  ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు మరికొంత మంది స్టార్ హీరోల సరసన నటించారు. 

తన సహజ నటనతో ఎన్నో అద్బుతమైన పాత్రల్లో నటించిన జయసుధ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత అమ్మ,అమ్మమ్మ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.  ఆమె కెరీర్ లో ఎన్నో  అద్భుతమైన పాత్రల్లో నటించి జీవం పోశారు.  జయసుధ అంటే సినీ పరిశ్రమలో ఎంతో గౌరవం కూడా ఉంది.  ఆ మద్య రాజకీయాల్లోకి వెళ్లిన ఆమె ఎమ్మెల్యే పదవిలో కొనసాగారు.  ప్రస్తుతం ఆమె వైసీపీలో కొనసాగుతున్నారు.   జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు. ఈ మద్య  అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 

తాజాగా ‘పండంటి కాపురం’ మూవీలో జమునమ్మకి కూతురిగా నటించా. ఆ సినిమా విడుదలైన నలభయ్యేళ్ల తర్వాత ఆమె, నేను కలిసి ఒకే వేదికపై పురస్కారం తీసుకోవడం గర్వంగా ఉంది’’ అన్నారు ప్రముఖ నటి జయసుధ. హైదరాబాద్‌లో వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో వెండితెర పురస్కారాల ప్రదాన వేడుక జరిగింది. ఇందులో సీనియన్‌ నటి జమునకి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని, జయసుధకి లెజండరీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..సినీ పరిశ్రమ తనకు తల్లిలాంటిది అని..ఇక్కడ ఎంతో మందితో అనుబంధం ఏర్పడిందని, ఇక్కడ నటులు తనను ఇప్పటి వరకు ఎంతగానో ఆదరించారని అన్నారు.  ఇక   జమునమ్మ దగ్గర క్రమశిక్షణని నేర్చుకున్నా అన్నారు. జమున మాట్లాడుతూ వి.బి. సంస్థ అధినేత విష్ణు బొప్పన ప్రత్యేకించి ఈ పురస్కారాన్ని నాకు ఇవ్వడం ఆనందంగా ఉంది  అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: