నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ కలెక్షన్స్ ఊహించిన స్టాయికన్నా డ్రాప్ అవడంతో ఈ మూవీ బయ్యర్ల పరిస్థితి ‘వాల్మీకి’ రిజల్ట్ బట్టి ఆధారపడి  ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా నాని తన సినిమాల వేగం కొనసాగిస్తూనే హీరోగా అదేవిధంగా నిర్మాతగా కూడ మరిన్ని సినిమాలు తీయాలని పధకాలు రచిస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితులలో నాని నిర్మాతగా తీయబోతున్న ఒక మూవీ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. నాని నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై 'అ!' సినిమా నిర్మించాడు.  

ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు లభించాయి కానీ కలక్షన్స్ పరంగా చెప్పుకోతగ్గ విజయం రాలేదు. అయితే ఆ మూవీ ఫలితం ఎలా ఉన్నా మరిన్ని చిన్న సినిమాలు తీసే ఆలోచనలలో నాని ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు టాక్. ఈ నేపధ్యంలో 'ఫలక్ నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ తో నాని ఒక సినిమా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈమూవీ కథ ఎలాంటిది అన్న క్లారిటీ లేకపోయినా నటుడుగా విశ్వక్ సేన్ కు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడినా ఈ వివాదాస్పద నటుడు గతంలో పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై బూతులు మాట్లాడిన పరిస్థుతులలో అతడి పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాంటి వివాదాస్పద వ్యక్తిత్వం ఉన్న ఒక నటుడుని ఇప్పుడు నాని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఇలాంటి విమర్శలు నాని పట్టించుకోడని సమర్ధత ఎవరిలో ఉన్నా నాని గుర్తిస్తాడు అంటూ మరికొందరు నాని సన్నిహితులు ఈ విషయమై కామెంట్స్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: