ఈరోజు విడుదల అయిన  ‘గద్దలకొండ గణేష్’ మూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వరుణ్ తేజ్ లుక్ డైలాగ్ డెలివరీతో పాటు ఇంత వరకు వరుణ్ తేజ్ లో కనిపించని మాస్ అవతారం ఈమూవీకి హైలెట్ గా మారుతుంది అంటూ ప్రాధమిక రిపోర్ట్స్ అందుతున్నాయి. 

దీనితో ఈ మూవీ హిట్ అంటూ అప్పుడే మెగా అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టేసారు. ఈ మూవీ టైటిల్ ను మార్చవలసిన పరిస్థితులు ఏర్పడినా మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ మూవీని ప్రమోట్ చేస్తూ హరీష్ శంకర్ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

ఈ సందర్భంలో హరీష్ శంకర్ గతంలో తాను పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాను తీస్తున్నప్పుడు ఒక పాటలో పవన్ ను నటింప చేయడానికి తాను పవన్ కాళ్ళు పట్టుకోవలసి వచ్చిన సందర్భాన్ని ఇప్పుడు గుర్తుకు చేసుకున్నాడు. ‘గబ్బర్ సింగ్’ మూవీ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరిగినప్పుడు ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే సాంగ్ ను షూట్ చేస్తున్న సమయంలో పవన్ కు విపరీతంగా వెన్ను నొప్పి వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

దీనితో పవన్ ఆ పాట షూటింగ్ ను ఆపుచేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళి పోతానని అక్కడ తనకు నొప్పి తగ్గాక హైదరాబాద్ లో ఆ పాటను షూట్ చేద్దామని చెప్పిన అప్పటి విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఈ పాటకు స్విట్జర్లాండ్  వాతావరణం బాగుంటుందని అని తాను పవన్ కు నచ్చచేపుతూ ఒత్తిడి చేయడమే కాకుండా చనువుతో పవన్ ను ఒప్పించడానికి కాళ్ళు పట్టుకోవడానికి తాను ప్రయత్నం చేసిన అప్పటి విషయాన్ని ఇప్పుడు చేసుకున్నాడు. దీనితో షాక్ అయిన పవన్ తన వెన్ను నొప్పిని భరిస్తూ ఆ పాటను పూర్తి చేసాడని పవన్ షూటింగ్ స్పాట్ లో పడేంత కష్టం చాల తక్కువ మంది హీరోలు పడతారు అంటూ పవన్ పై హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: