మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా" నరసింహారెడ్డి మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధమవుతున్న సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ట్రైలర్ కి విశేష స్పందన లభించింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు ఏ విధంగా తీసుకుంటారో అని అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది.


చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చేస్తున్న చిత్రం కావడంతో బాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ ఉంటుందోనని సందేహాలు ఉండేవి. అసలు హిందీ ప్రేక్షకులతో పూర్తిగా కనెక్షన్ కోల్పోయిన చిరు ఈ వయసులో వాళ్లను ఆకట్టుకోగలరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ‘సైరా’ విడుదల దగ్గర పడేసరికి పరిస్థితి మారుతోంది.నిన్న రిలీజైన ‘సైరా’ ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ వాళ్లే షాకవుతున్నారు.


అయితే "సైరా" లో చిరంజీవికి గురువుగా అమితాబ్ బచ్చన్ గారు నటిండంతో ఈ ట్రైలర్ అక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సైరా టీజర్ ని ముంబయిలో రిలీజ్ చేసిన చిత్ర బృందం ట్రైలర్ ని మాత్రం హైదరాబాద్ లోనే రిలీజ్ చేశారు. ఇకపోతే సైరా ట్రైలర్ కి బాలీవుడ్ స్టార్ల నుండి చాలా సపోర్ట్ వస్తుంది. బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్ గురించి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.


అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్టు గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఖాన్ సైరా గురించి ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ, నేన్ను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని చెప్పడం ఆయన ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. మరి సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: