వాల్మీకి సినిమాకు ముందు తెలంగాణ యాసలో వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేశారు.  అందులో ఒకటి ఫిదా.  ఫిదా సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి తెలంగాణ యాసతో ఆకట్టుకుంది.  ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  అనంతరం వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమా చేశాడు.  ఇందులో తెలంగాణ యాసతో ఆకట్టుకున్నాడు.  ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో  తనకు తెలంగాణ యాసతో చేసే సినిమాలు కలిసి వస్తున్నాయని అనుకున్నాడు. 


ఈ సెంటిమెంట్ ను నెక్స్ట్ సినిమాలో కూడా కొనసాగించాలని అనుకున్నాడు.  అనుకున్నట్టుగా గద్దలకొండ గణేష్ సినిమా చేశాడు.  ఇందులో వరుణ్ తేజ్ పక్కా తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదీ మాస్ భాషలో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు.  ఇదే సినిమాకు ప్లస్ అయ్యింది.  తెలంగాణ నుంచి హీరోగా విజయ్ దేవరకొండ అదరగొడుతున్నాడు.  అర్జున్ రెడ్డి సినిమాతో తెలంగాణ మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు.  


నైజాంలో దూసుకుపోతున్న విజయ్ కు చెక్ పెట్టేందుకు ఈ మెగా ప్రిన్స్ రంగంలోకి దిగినట్టు ఈ సినిమా  స్పష్టం చేస్తోంది.  మాస్ హీరోగా వేసిన మొదటి అడుగు సక్సెస్ కావడంతో ఇకపై ఖచ్చితంగా మాస్ సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు అనడంలో సందేహం అవసరం లేదు.  మాస్ సినిమాలకు నైజాంలో మంచి మార్కెట్ ఉంటుంది.  నైజాం హీరోగా పేరు తెచ్చుకుంటే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి.  


అర్జున్ రెడ్డి, గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ నైజాంలో డల్ అయ్యాడు. దీంతో ఎలాగైనా విజయ్ మార్కెట్ ను వరుణ్ సొంతం చేసుకోవాలని అనుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసం కాకాపోయినా తెలంగాణ యాసలో సినిమా చేయడం వలన లోకల్ హీరోగా పేరు తెచ్చుకోవచ్చు.  హీరో రామ్ సైతం పక్కా లోకల్ సినిమా ఇస్మార్ట్ శంకర్ చేసి హిట్ కొట్టాడు.  లోకల్ భాషలో నచ్చే విధంగా సినిమాలు చేస్తే.. పక్కా హిట్ అవుతుందని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి.  అప్పట్లో విజయశాంతి కూడా లోకల్ తెలంగాణ యాసతో కొన్ని సినిమాలు చేసి మెప్పించిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: