ఇటీవలి కాలంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న తీరు చూస్తే సామాన్యుడు నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి భయపడే పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల తో ఇక జీవనాన్ని సాఫీగా సాగించడం ఎలా అని ఆందోళన చెందాల్సిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడెప్పుడో 70 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇక ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. పెట్రోల్ ధర సెంచరీ కొట్టిందని సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు.  వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించండి మహాప్రభో అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకోవడం కూడా చేశారు. కానీ సామాన్యుల గోడు ప్రభుత్వాలు ఎప్పుడు వినిపించుకున్నాయి కనుక ఇప్పుడు పట్టించుకోవడానికి.


 ఇక సామాన్యుల ఎంత మొత్తుకున్నా మా వల్ల కాదు బాబోయ్ అంటూ నిరసనలు చేసినా అటు పెట్రో బాదుడు మాత్రం ఆపలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారీగా టాక్స్ లు వేస్తూ ఇక పెట్రోల్ ధరలు మరింత పెరిగి పోవడానికి కారణం అవుతున్నాయి. ఇది ఏంటని అడిగితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం తప్ప సామాన్యుడికి ఒరిగింది మాత్రం ఏమీ లేదు. అయితే ఇక ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర మూడు వందల ముప్పై రూపాయలకు చేరింది. ఏంటి.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కదా.


 అంతలా ఉలిక్కి పడకండి.. ఇలా పెట్రోల్ ధర 339 రూపాయలకు చేరింది మనదేశంలో కాదు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశమైన శ్రీలంక లో. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగి పోయి ప్రతీ వస్తువు ధర కూడా అమాంతం పెరిగిపోయింది. సామాన్యుడు కనీసం నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అక్కడి పౌరులు కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా ధరలు పెంచేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్కరోజులోనే పెట్రోల్ ధర 84 రూపాయలు పెంచింది. దీంతో ఇక లీటర్ పెట్రోల్ ధర 338 చేరింది. సూపర్ డీజిల్ ధర ఒక్కరోజే 75 రూపాయలు పెంచడంతో 329 రూపాయలకు చేరింది. ఇక మరోవైపు ఆటో డీజిల్ ధర 113 రూపాయలు పెరగడంతో 289 రూపాయలకు పెరిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి: