
హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తండ్రి పెడుతున్న హింసను ఇక తట్టుకోలేకపోయిన ఒక కూతరు ఇంట్లో నుంచి పారిపోయింది. గత నెల 29న ఒక కూతరు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ యువకుడితో ఆ యువతి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను తిరిగి తన తండ్రికి అప్పగించారు. ఇదే సమయంలో తన సోదరి ఎందుకు ఇంట్లో నుంచి పారిపోయావంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తన తండ్రి పెడుతున్న హింస గురించి చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి రోజూ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పుకొచ్చింది.
ఈ మాటలు విన్న సోదరి కూడా వెంటనే కన్నీటి పర్యంతమైంది. తన సోదరినే కాకుండా తనను కూడా తండ్రి నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి పెట్టే హింసలను సహించేది లేదని అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తండ్రి గురించి ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతడిపై సెక్షన్ 376(2)(ఎఫ్)(ఎన్), 376 (3), 506లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సైతం సిగ్గు లేదా అంటూ తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.