తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై రాష్ట్ర ప్రజల దృష్టి  ఉన్న సంగతి తెలిసిందే.  హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక లో అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని అందరూ అనుకుంటున్నా రు. అంతేకాదు దేశంలో ఇప్పటివరకు ఇలాంటి ఉప ఎన్నిక జరగలేదని... ఈ ఉప ఎన్నిక చాలా ఖరీదైనదని  జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ రెండు పార్టీల మధ్య హుజూరాబాద్ నియోజకవర్గం లో హోరా హోరీ పోటీ జరుగుతోంది. అసలు హుజరాబాద్ ఓటర్లు ఎటువైపు ఉంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

అధికార టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను  నిలబెట్టినా... పోటీ మాత్రం మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్సెస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అటు ఇరుపార్టీల ప్రచారం కూడా ఈ యాంగిల్ లోనే కొనసాగడం..   ప్రతి ప్రచారంలోనూ సీఎం కేసీఆర్ అభివృద్ధిని.. టిఆర్ఎస్ నాయకులు లేవనెత్తడం జరుగుతోంది. అలాగే అధికార టీఆర్ఎస్ పార్టీ దళిత బంధు, హుజురాబాద్ కు నిధులు విడుదల మరియు ఇతర సంక్షేమ పథకాలు చాలా జోరుగా సాగుతోంది.

ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకుండా హుజూరాబాద్ నియోజకవర్గం లో పావులు కదుపుతోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న కీలకమైన లీడర్లు అందర్నీ లాగేసుకుంది... అధికార టీఆర్ఎస్ పార్టీ. దీంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపు చాలా కష్టమని అందరూ భావిస్తున్నారు. సామ, దాన, దండోపాయాలను అమలు చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ ముందు... మాజీ మంత్రి ఈటల రాజేందర్ తేలిపోవడం ఖాయమని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎటువైపు ఉంటారని దాని పై క్లారిటీ రావాలంటే అక్టోబర్ 30వ తేదీ వరకు వేచి చూడాలి. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30వ తేదీన జరగనుండగా నవంబర్ 2వ తేదీన ఫలితాలు బయట పడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: