భార‌త‌దేశంలో వ‌ర్ష‌పాతం అనేది ఎక్కువ‌గా ఋతుప‌వ‌నాల ద్వారానే వ‌స్తుంటుంది. నైరుతి ఋతుప‌వ‌నాలు దేశ‌వ్యాప్తంగా విస్తరించ‌డం మూలంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్రతీ సంవ‌త్స‌రం తొలుత కేర‌ళ‌ను తాకిన అనంత‌రం దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌కు ఋతుప‌వ‌నాలు మెల్ల‌గా వ్యాపిస్తాయి.
త‌ద‌నంత‌రం తిరుగుముఖంప‌డ‌తాయి. ఈ సంవ‌త్స‌రం ఋతుప‌వ‌నాలు ఆల‌స్యంగా తిరోగ‌మించిన కార‌ణంగా కేర‌ళ రాష్ట్రంలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో  కేర‌ళ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించి చెరువులు, న‌దులు అన్ని ఉప్పొంగుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లోనైతే కొండ‌చ‌రియ‌లు సైతం విరిగి ప‌డిపోతున్నాయి. దీంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కూడ అధికారులు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. అక్క‌డి ప‌రిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా నైరుతి ఋతుప‌వ‌నాలు తిరోగ‌మించ‌డం మొద‌ల‌య్యాయ‌ని.. త్వ‌ర‌లోనే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతాయ‌ని వాతావ‌ర‌ణంకు సంబంధించిన నిపుణులు ఒక అంచెనా వేస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు మ‌రో 48 గంట‌ల పాటు కేర‌ళ‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

ఇటీవ‌ల భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ నైరుతి ఋతుప‌వ‌నాలు దేశంలోని వాయువ్య ప్రాంతాల నుంచి తిరుగుముఖం ప‌ట్టాయ‌ని వివ‌రించింది. దీంతో కేర‌ళ‌లోని ఆరు జిల్లాల‌ను హెచ్చ‌రించింది. కొట్టాయం ప‌త‌నంతిట్ట‌, ఎర్నాకుళం, ఇడుక్కి, పాల‌క్కాడ్, త్రిసూర్‌, ద‌క్షిణ‌, మ‌ధ్య కేర‌ళ ప్రాంతం వ‌ర్షంతో తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది.  కేర‌ళ‌లో వ‌చ్చిన  వ‌ర‌ద‌ల‌తో ప‌లు న‌ష్టం వాటిల్లింది. తాజాగా ఐఎండీ బులిటెన్ ప్ర‌కారం.. అరేబియా స‌ముద్రం, కేర‌ళ‌పై అల్ప‌పీడ‌న ప్ర‌భావం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని వెల్ల‌డించింది. ఉత్త‌ర కేర‌ళ‌, క‌ర్నాట‌క తీర ప్రాంతాల్లో తూర్పు అరేబియా స‌ముద్రంలో అల్ప‌పీడ‌న ప్ర‌భావం ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. వ‌చ్చే 24 గంట‌ల్లో కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని.. త‌రువాత త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని పేర్కొన్న‌ది. కేర‌ళ‌లో వ‌ర్షం భీభ‌త్సానికి దాదాపు 27 మంది మృత్యువాత ప‌డిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇంకా చాలా మంది మ‌ర‌ణించే ప్ర‌మాదం లేక‌పోలేదు. వాతావ‌ర‌ణ శాఖ మాత్రం కేర‌ళ‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటు నుంచి మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: