
వీళ్ళందరూ పేరుకు ఇక్కడ పుట్టినా వీళ్ళందరూ ఆయా దేశాలను గొప్పవిగా భవిస్తూ, స్వదేశాన్ని చులకన చేస్తుంటారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, అణు అస్త్రాలు విషయంలో కావచ్చు, క్షిపణుల తయారీ విషయంలో కావచ్చు వీళ్ళ భావజాలంలో మార్పులు రాలేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని దేశానికి అణు ఆయుధాలు అవసరమా అని విమర్శలు చేశారు. కానీ వాజ్ పేయి వెనక్కి తగ్గలేదు. ఇస్రో కు స్పష్టంగా చెప్పారు, భారత్ ను అంతరిక్ష పరోశోధన రంగంలో ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని. ఒక స్థాయిలో పేదరికం చైనా లో ఉంది, రష్యా లో ఉంది, అమెరికాలో ఉంది. వీరందరూ చేస్తున్నప్పుడు భారత్ ఎందుకు చేయకూడదు అనేది అధికార పార్టీ వాదన. రక్షణ ఏ దేశానికైనా గుండె వంటిది. అది సరిగా ఉంటేనే దేశం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవాలి.
ఆనాడు ప్రారంభించిన అంతరిక్ష పరిశోధన ఇప్పుడు స్వయం శక్తిని సాదించుకున్నాయి. తాజాగా ఇస్రో వివిధ దేశాల తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 1100కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే వాళ్ళ సంపాదన వాళ్ళే చేసుకుంటున్నారు. భారత్ ఉపగ్రహాల ప్రయోగంలో ఇప్పటికే ప్రపంచ స్థాయిలో నిరూపించుకున్న నేపథ్యంలో అనేక దేశాలు ఇస్రో కు తమ ప్రాజెక్టులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీనితో ఇస్రో కూడా రాబోయే రోజులలో దేశానికి కూడా సంపాదించిపెట్టే స్థాయికి వస్తుంది. దానికి కూడా పెద్ద సమయం ఏమి పట్టదు. ఇదంతా ఒకనాడు ధైర్యంగా అడుగు వేయడం ద్వారా వచ్చిన ఫలితాలు. నాడు ఈ అడుగు ఎవడో ఏదో అంటున్నాడు అని ఆపేసి ఉంటె, నేటికి ఈ విజయం లభించేది కాదు. విమర్శలు చేసేవారు కూడా ఆయా దేశాల కు అమ్ముడుపోయి, వాటికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎప్పటికి ఇలాంటి గొప్ప చరిత్రలు తమదేశాల పేరుతోనే ఉండాలి అని కొన్ని దేశాలు ఇతర దేశాలపై ఆధిపత్యాన్ని చూపించే భావజాలం ఇదంతా. దానిని భారత్ చక్కగా తిప్పికొడుతూనే ఉంది. ఇది భారత్ విజయం.