ఒమిక్రాన్ పేరు చెబితేనే ఇప్పుడు వణికిపోతున్నారు. అదో కొత్త వైరస్‌లా ఫీలవుతున్నారు. ఒమిక్రాన్ అనేది కరోనాలో వచ్చిన కొత్త వేరియంట్.. అది కూడా చాలా బలహీనమైన వేరియంట్‌.. అందువల్లే ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నా పెద్దగా అనారోగ్యాలు లేవు.. మరణాలు అంతకన్నా లేవు. గణాంకాల ప్రకారం చూస్తే ఒమిక్రాన్ కేసులు త్వరలోనే లక్షల్లోకి చేరొచ్చు. అలాగే ఒమిక్రాన్ ఎవరినీ వదలదు .. ఒమిక్రాన్ అందరికీ సోకుతుంది కూడా.. అయితే ఒమిక్రాన్‌ గురించిన కొన్ని నిజాలు తెలుసుకుంటే మనకు ఆందోళన ఉండదు.


అదేంటంటే.. ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. మిగిలిన పది మందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. అంటే ఒమిక్రాన్ అనేది సూపర్ మైల్డ్ అన్నమాట. అలాగే. ఒమిక్రాన్ మనిషిని చంపదు... అంతే కాదు.. ఎలాంటి మందులు వాడకుండానే కోలుకుంటున్నారు. ఇందుకు లక్షలాది మంది దక్షిణాఫ్రికా వాసులే ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్లు కూడా ఒమిక్రాన్ రోగులకు కేవలం విటమిన్ మాత్రలే ఇచ్చినట్టు చెప్పారు .


ఒమిక్రాన్ వస్తే.. జలుబు, గొంతులో గరగర ఉంటుంది. కొద్ది పాటి నలత ఈ ఒమిక్రాన్ లక్షణాలు.. అంతే.. కొంత మందికి ఒకటి రెండు రోజులు జ్వరం రావచ్చు. మూడు రోజుల పాటు వేడి నీళ్లు తాగితే సరిపోతుంది. గొంతులో గరగర ఆంటే వేడి నీళ్లలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగాలి. ఒకవేళ జ్వరం ఉంటే డోలో 650 ఒకటి రెండు రోజులు తీసుకోవచ్చు.


అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించవచ్చు . ఒమిక్రాన్ బాధితులకు నూటికి 90 శాతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమే ఉండదు . ఆక్సిజన్ అవసరం కూడా ఏర్పడదు . ఒమిక్రాన్ మల్ల  రుచి వాసన కూడా పోవు . ఇంతెందుకు.. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది చిన్నపాటి జలుబు లాంటిది.. అంతే.. కాస్త ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి.  రెండు రోజులు విశ్రాంతి సరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: