సాధారణంగా పేద మధ్యతరగతివాళ్ల బ్యాంక్ అకౌంట్ లో పెద్దగా డబ్బులు ఉండవు. ఎందుకంటే వారికి వచ్చే ఆదాయం తక్కువగానే ఉంటుంది కాబట్టి వచ్చిన ఆదాయం ఖర్చులకే సరిపోతోంది. ఇక బ్యాంకులో జమ చేసుకోవడానికి ఇంకేముంటుంది. ఒకవేళ ఉన్నా తక్కువ మొత్తంలో డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి.అదే నిరు పేద వృద్దుడు ఖాతాలో అవి కూడా కొన్ని కొన్ని సార్లు కనిపించవు. కానీ ఇక్కడ ఒక నిరు పేద వృద్దుడు బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు వృద్ధుడు. అలాంటి వృద్ధుడి ఖాతాలో ఏకంగా 75 కోట్లు ప్రత్యక్షం కావడం అటు బ్యాంకు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఏం జరిగి ఉంటుందా అని ఆరా తీస్తే మాత్రం అసలు విషయం బయటపడింది. జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధుడి పింఛన్ ఖాతాలో ఏకంగా 75 కోట్లకు పైగానే నగదు జమ అయింది. దీంతో తన ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ కావడం చూసి ఆ వృద్ధుడు సైతం షాక్ అయ్యాడు. పూరి గుడిసెల్లో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మీద ఆధారపడి బ్రతుకుతున్న నాకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడం ఏంటి.. నా కష్టాలను చూసి దేవుడే కరుణించాడు ఏమో అని అనుకున్నాడు ఆ వృద్ధుడు. కానీ అసలు విషయం తెలిసి  షాక్ అయ్యాడు. జార్ముండి మండలం సాగర్  గ్రామం లో కుమారుడు భార్యతో కలిసి ఉంటున్నాడు పూలో రాయ్ అనే వ్యక్తి. ఒక పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు. ఈ ఈ క్రమంలోనే  వ్యవసాయం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన పింఛంతో జీవనం సాగిస్తూ వస్తున్నాడు సదరు వ్యక్తి. అయితే ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అతనికి ఉన్న పింఛన్ ఖాతాలో ఏకంగా 75 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు ఏమీ అర్థం కాలేదు.. ఇక దేవుడే కష్టాలు తీర్చడానికి అంత డబ్బు వేసాడు అని అనుకున్నాడు ఆ యువకుడు. ఇకపోతే పులోరాయ్ ఖాతాలోకి డబ్బులు ఎలా వచ్చాయి అన్న విషయం పై విచారణ చేపడతామని బ్యాంకు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: