తాను మంచి చేయ‌డం కోసం వెళ్తే త‌న‌కు చెడు ఉద్దేశాలు అంట‌గట్టడం ఎంత మాత్రం మంచిది కాద‌ని హిత‌వు చెబుతున్నారు చిరు.. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!

ఆంధ్రావ‌ని రాజ‌కీయాల కార‌ణంగా ఇండ‌స్ట్రీలో మ‌ళ్లీ కొత్త చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.ఇవ‌న్నీ చిరు చుట్టూనే తిరుగుతున్నాయి. రానున్న కాలంలో ఇవి మ‌రింత తీవ్ర‌త‌రం కానున్నాయి.ఎందుకంటే చిరుతోజ‌గ‌న్ భేటీ సంద‌ర్భంగా మీడియా లీక్స్ అంటూ కొన్ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.వాటి ప్ర‌కారం చిరుకు రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇస్తార‌ని,అందుకు వైసీపీ బాస్ సుముఖంగా ఉన్నార‌ని పేర్కొంటూ ఏపీ సీఎంఓ కొన్ని లీక్స్ ఆధారంగా వార్త‌లు రాశామ‌ని మీడియా చెబుతోంది.దీనిపై నిన్న చిరు స్పందించి ఖండించారు కూడా!అయినా చిరు ఈ విష‌యాన్ని అంత తేలిగ్గా తీసుకోవ‌డం లేదు. గివ్ న్యూస్ నాట్ వ్యూస్ పేరిట ట్విట‌ర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ పోస్టు చేసి, సంచ‌ల‌నం అయ్యారు. ఆయన పోస్టుకు యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ద్ద‌తు ప‌లికారు.దీంతో ఈ వివాదంపై ఇత‌ర హీరోలు కూడా స్పందించేందుకు అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.ఈ నేప‌థ్యంలో అగ్ర‌తార‌లు ఏం మాట్లాడ‌తారు..లేదా మాకెందుకు ఈ వివాదం అని సైలెంట్ అయిపోతారా అన్న‌ది కూడా ఓ చ‌ర్చ‌గానే మారింది.


సంక్రాంతి రోజున ఎవ‌రి ఇళ్ల‌లో వాళ్లు ఉంటూ ఎవ‌రి ఊళ్ల‌లో వాళ్లు ఉంటూ పండుగ చేసుకోక ఎందుకీ త‌గాదాలు అని ప్ర‌శ్నిస్తున్నారు మెగాభిమానులు.మీడియా ఎప్ప‌టి నుంచో చిన్న‌దాన్ని కూడా చిలువ‌లు ప‌లువ‌లు చేసి రాయ‌డంపై వివాదాలు నెల‌కొని ఉన్నాయి. అభిప్రాయ భేదాలు కూడా నెల‌కొని ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో ఇష్టారాజ్యంగా రాస్తున్న మీడియాని నిలువ‌రించే ప్ర‌య‌త్నం అయితే చేయ‌డం లేదు అన్న వాద‌న కూడా మెగా టీం నుంచి ఉంది.తాజాగా జ‌గ‌న్ తో తాను భేటీ అయింది ఇండ‌స్ట్రీ కోసమేన‌ని రాజ‌కీయ ఉద్దేశాలు అస్స‌లు లేవ‌ని చిరు చెప్పినా డిజిట‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.వీటిపైనే చిరు చాలా సీరియ‌స్ అవుతున్నారు. త‌మ‌ క్లారిఫికేషన్ విన్న త‌రువాత కూడా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించకుండా అదే ప‌నిగా కొన‌సాగించ‌డం త‌గ‌దు అని కూడా మెగా టీం భావిస్తోంది. ఈ స‌మ‌యంలో వివాదాలను పెంచుకునే క‌న్నా ప్ర‌త్యామ్నాయ దారుల్లో మీడియాకు చెప్పాల్సినంత చెప్పాల్సి ఉంది. లేదా ట్విట‌ర్ వేదిక‌గా సెల‌బ్రిటీలు చెప్పే ఆ నాలుగు మాట‌లు విని మీడియా త‌న విధి విధానాలు మార్చుకోవాల్సి ఉంది.ఇవేవీ జ‌ర‌గ‌కుండా చిరు కానీ మ‌రొక‌రు కానీ అస‌త్య వార్త‌ల ప్రచారాన్ని ఆప‌డం క‌ష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: