ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్ళలో తమకు ఏ ఇబ్బందులు ఉండవు, తమకు వచ్చిన ఏ ఇబ్బంది లేదని భావించిన ఉద్యోగస్తులు ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇన్నాళ్ళు జగన్ చూసి చూడనట్టు వదిలేస్తారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆగమేగాల మీద పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది.

 

స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్తున్న జగన్, అవినీతిని ఏసీబీ ద్వారా అరికట్టే విధంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే జగన్ ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి కనపడటం లేదు. స్పందన కార్యక్రమం ద్వారా ఆర్జీలను దాదాపుగా పరిష్కరిస్తున్నారు. రాజకీయాలను చూడం, మతాలను చూడం అంటూ ఎన్నికల సమయంలో స్పష్టంగా చెప్పిన జగన్ ఇప్పుడు అదే విధంగా కీలక అడుగు వేస్తున్నారు.

 

ఎవరు వచ్చినా సరే అధికారులు సమస్యలను పరిష్కరించాల్సిందే. పెన్షన్, పాస్ బుక్, రేషన్ కార్డ్, ఇలా ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందకుండా ఉండటానికి వీలు లేదు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జగన్. దీనితో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆ ఉద్యోగి ఈ ఉద్యోగి అనే తేడా లేకుండా కష్టపడే పరిస్థితి కల్పించారు. 

 

ఇక అవినీతి విషయంలో కూడా జగన్ ఎక్కడ కూడా ఊరుకునే పరిస్థితి కనపడటం లేదని అంటున్నారు అధికారులే. ఇన్నాళ్ళు జగన్ పెద్దగా పట్టించుకోరు అని భావించిన వాళ్ళు ఇప్పుడు ఏ అధికారి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాడో అర్ధం కాక చుక్కలు చూస్తున్నారు.

 

అవినీతిలో ఉన్న ప్రతీ తిమింగలం ఇప్పుడు జగన్ దెబ్బకు భయపడుతుంది. ఇన్నాళ్ళు మింగిన సొమ్ము ఎక్కడ కక్కాల్సి వస్తుందో అనే భయం వారిలో నెలకొంది. జగన్ ఇక క్షమించేది లేదు అనే విషయం అర్ధమైన తర్వాత అధికారులు కూడా లంచం అడగడం దాదాపుగా ఆపేసారని అంటున్నారు. ఈ విధంగా జగన్ వారికి చుక్కలు చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: