మాజీ సీఎం చంద్రబాబు అన్నా.. ఆయన కుమారుడు లోకేశ్ అన్నా వైసీపీ లీడర్ ఆర్కే రోజా ఓ రేంజ్ లో ఫైర్ అవుతారన్న సంగతి తెలిసిందే. నిన్న విశాఖ పట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ ను వైసీపీ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరారు.. వైసీపీ డబ్బులిచ్చి కూలీలను తెచ్చి చంద్రబాబు అడ్డుకుందని విమర్శించారు.

 

 

ఇక చంద్రబాబు తనయుడు లోకేశ్ అయితే ఈ అంశంపై బాగా ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో విశాఖలోనూ ప్రశాంతంత కరవవుతోందన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖకు పులివెందుల గూండా రాజ్యమేలుతున్నారని.. వారే చంద్రబాబు ను అడ్డుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఈ విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

 

 

విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలేనని ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుకు స్వాగతం పలుకుతారా అని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. విశాఖలో రౌడీలు అడ్డుకున్నారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా నారా లోకేశ్ కు సవాలు విసిరారు. సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదన్నారు.

 

 

ఇదే సమయంలో రోజా ఒక్కసారి గతం గుర్తు చేసుకున్నారు. గతంలో తాను మహిళా సదస్సుకు వెళ్తే విజయవాడ ఎయిర్‌ పోర్టులోనే అడ్డుకుని రోజంతా తిప్పి తిప్పి హైదరాబాద్‌ పంపించారని అన్నారు. మరి ఆ రోజు కనిపించని రాజ్యాంగం టీడీపీ నేతలకు ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తూ..వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చంద్రబాబుకు ఏవిధంగా స్వాగతం పలుకుతారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పెద్ద మనిషికి ఆ మాత్రం కామన్‌సెన్స్‌ కూడా లేదా అని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: