భారతదేశాని నిర్భయ అత్యాచారం ఘటన కలచివేసింది. 2012 వ సంవత్సరంలో జరిగిన ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పై అనేక విమర్శలు వచ్చాయి. స్త్రీని ఎంతో పూజించే దేశంగా భావించే ఇటువంటి దేశంలో అమ్మాయిలపై ఇలాంటి ఘటనలు జరగటం ముమ్మాటికి అక్కడి ఉన్న ప్రభుత్వాల నిర్లక్ష్యం మరియు చట్టాలలో లోపం అని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రావడం జరిగాయి. దీంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.

 

ఈ చట్టం వల్ల దేశంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో చట్టం తీసుకు వచ్చారు. అయితే నిర్భయ అత్యాచారం చేసిన హంతకులకు మాత్రం ఇంకా శిక్ష పడకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం దాదాపు 8 సంవత్సరాల నుండి ఈ కేసుకు సంబంధించి హంతకులకు శిక్ష విధించాలని బయటనుండి ఒత్తిడి వస్తున్నా గాని హంతకుల తరఫున లాయర్లు వాదిస్తూ దాదాపు 8 సంవత్సరాల పాటు వారికి ఎటువంటి శిక్ష పడకుండా కాపాడుతూ వస్తున్నారు.

 

తాజాగా ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడే విధంగా అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరోపక్క నిందితుల తరుపున లాయర్లు మాత్రం ఏదో ఒక సెక్షన్ తెరపైకి తీసుకు వస్తూ డెత్ వారంట్ వాయిదా పడేలా చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడటంతో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ పోలీసులు 'దిశా' అత్యాచారం విషయంలో జరిగిన ఎన్ కౌంటర్ మళ్లీ జరగాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో మరొక ఆడపిల్లలపై ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే...నిర్భయ అత్యాచార ఘటనకు సంబంధించి హంతకులకు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా విమర్శలు రావటం జరిగాయో ఆ విధంగానే ప్రశంసలు వచ్చే విధంగా శిక్ష విధించాలని కోరుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: