ఫొటోలో హ్యాపీగా కనిపిస్తున్న ఈ ఫ్యామిలి  ఎవరిదో తెలుసా ?  దేశంలో సంచలనం సృష్టించిన ఎస్ బ్యాంకు ప్రమోటార్లు రాణాకపూర్ ఫ్యామిలినే ఇది. బ్యాంకు నిర్వహణలో భారీగా అవకతవకలకు పాల్పడటంతో బ్యాంకు దాదాపు దివాలా తీసేసింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుటుంబం వేల కోట్ల రూపాయలకు జనాలను ముంచేసిందనటం కరెక్టేమో ? వేలాది కుటుంబాల కష్టార్జితాన్ని కొందరు పారిశ్రామికవేత్తలకు ఉదారంగా అప్పులిచ్చేసి వాళ్ళ దగ్గర నుండి కమీషన్లు కొట్టేసింది ఈ కుటుంబం.

 

కుటుంబం చేసిన మోసాలు, అవకతవకల ఫలితంగా సుమారు 14 వేల కోట్ల రూపాయలకు ముణిగిపోయింది. దాంతో దివాలా తీసినట్లే అనుకోవాల్సొస్తోంది. సరే కేంద్రప్రభుత్వం మళ్ళీ ఈ బ్యాంకును నిలబెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో తెలీదు కానీ మొత్తానికి ప్రత్యక్షంగా వేలాదిమంది ఖాతాదారులు ముణిగిపోతే పరోక్షంగా అంటే బ్యాంకు షేర్లు కొన్న వేలామంది కూడా రోడ్డున పడ్డారు. కుటుంబంలొని ఐదుమందిపైనా సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్ధలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది లేండి.

 

అసలు పై ఫొటోలో ఉన్నదెవరో తెలుసా ? రాణాకపూర్ తో పాటు ఆయన భార్య బిందు కపూర్. కూతుర్లు  రాధా కపూర్, రోష్నీ కపూర్, రాఖీ కపూర్ ఎంత హ్యాపీగా ఉన్నారో. బ్యాంకు కుంబకోణం బయటపడిన వెంటనే రాధా కపూర్ విదేశాలకు వెళ్ళబోతుంటే సిబిఐ అధికారులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కుటుంబంపైనే సిబిఐ లుకౌట్ నోటీసు జారీ చేసింది కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు దాదాపు తక్కువనే అనుకోవాలి.

 

ఎస్ బ్యాంకు నుండి సుమారు రూ. 4 వేల కోట్ల అప్పు తీసుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డిహెచ్ఎఫ్ఎల్) మొత్తం అప్పును ఎగ్గొట్టింది. దాంతో బ్యాంకు నుండి వేల కోట్ల అప్పును తీసుకున్నందుకు సదరు సంస్ధ డూయిట్ అర్జన్ వెంచర్స్ అనే మరో సంస్ధకు 600 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ డూయిట్ సంస్ధ ఎవరిదయ్యా అంటే రాణాకపూర్ కుటుంబానిదే అని బయటపడింది. అంటే ఒకచేత్తో వేల కోట్లు అప్పులిస్తు మరోచేత్తో దానికి వందల కోట్ల కమీషన్లు తీసుకుంటున్నారన్నమాట. అంటే డిహెచ్ఎఫ్ఎల్ విషయంలో బయటపడిన ఓ ఉదాహరణ మాత్రమే. ఈ కుటుంబం లీలలు ఇంకెన్ని ఉన్నాయో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: