ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అనంతపురం జిల్లాలో టీడీపీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా పరిటాల వర్గానికి పట్టున్న... ధర్మవరం, పెనుగొండ, రాప్తాడు, అనంతపురం రూరల్, అనంతపురం టౌన్. ఈ నియోజక వర్గాల్లో పార్టీ ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. ఈ నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి అభిమానులు ఉన్నారు. వాళ్ళు అందరూ ఇప్పుడు పార్టీలోనే ఉన్నారు. రవి మరణం తర్వాత వాళ్ళే పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కు అయ్యారు. 

 

అయితే వాళ్ళు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వాళ్లకు ఏ మాత్రం మేలు జరగలేదు అనే భావన ఎక్కువగా ఉంది వారిలో. కనీసం మంత్రిగా ఉన్న పరిటాల సునీత అప్పుడు పరిటాల వర్గానికి ఒక్క ఇల్లు కూడా ఇప్పించాలేదని, రవి బ్రతికి ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు చేసారని దీనితో పరిటాల వర్గానికి అన్యాయం జరిగింది అనే భావనలో వాళ్ళు దూరమయ్యారు. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో ఏ న్యాయం చేయలేకపోయారని, పార్ధసారధి తో ఉన్న విభేదాలతో ఆ నియోజకవర్గాన్ని లైట్ తీసుకున్నారని వాళ్ళు అసహనంగా ఉన్నారు. 

 

దీనితో పరిటాల రవి సొంత గ్రామంగా ఉన్న వెంకటాపురం పంచాయితి ని కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అక్కడ పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకి రావడం లేదని అంటున్నారు. ఈ విషయం తెలిసినా గాని పార్టీ పెద్దలు గాని పరిటాల కుటుంబం గాని పెద్దగా దృష్టి పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. అలాగే చాలా గ్రామాల్లో పరిస్థితులు ఉన్నాయని ఇది పార్టీకి ఇబ్బందికర పరిణామం అని అంటున్నారు. మరి దీని నుంచి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బయటపడుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: