కొద్దోగొప్పో చదువుకున్నాడు..! ఇంగ్లీష్‌ కూడా మాట్లాడతాడు..! మంచి ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పోషిస్తానని అమ్మకు హామీ కూడా ఇచ్చాడు..! కానీ చివరకు స్నేహితులతో కలిసి పక్కదారి పట్టాడు..!  నిర్భయపై అతి కిరాతకంగా అత్యాచారం జరిపి ఉరికంబం ఎక్కాడు.   వినయ్ శర్మ... ఢిల్లీలోని మురికి వాడల్లో పుట్టి పెరిగి క్షణికావేశంలో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 

 

వినయ్ శర్మ.... వయస్సు 26 సంవత్సరాలు... 1994 మార్చ్‌లో దక్షిణ ఢిల్లీలోని మురుకివాడలో పుట్టాడు. ఢిల్లీలో ఉన్న బిర్జి ఖాన్ సమాధికి సమీపంలో రవిదాస్ పేరుతో మురికివాడ ఉంది. ఇక్కడ 300 ఇళ్లు ఉంటాయి. వినయ్ శర్మ కూడా ఇక్కడే ఉంటాడు. కూలినాలి చేసుకుని బతికే కుటుంబం. తండ్రికి ఆర్ధికంగా సాయంగా ఉండేందుకు చదువుకుంటూనే  ఓ జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేరాడు. నెలకు మూడు వేలు సంపాదిస్తూ అండగా ఉండేవాడు.

 

నిర్భయ ఘటన వెలుగులోకి వచ్చేంత వరకు వినయ్ శర్మ మంచి బాలుడే...వినయ్‌ శర్మ ఉన్న మురికివాడకు వెళ్లి ఎవరిని పలకరించినా... అతడు చాలా మంచి వాడని చెబుతారు. జిమ్‌లో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో క్రికెట్ ఆడుకుంటూ గడిపేవాడు. నిర్భయ దోషుల్లో అక్షరం ముక్క తెలిసిన ఏకైక వ్యక్తి వినయ్ శర్మ మాత్రమే. చదువువంటే ఇష్టం.. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతాడు.. జిమ్ ఇన్‌ స్ట్రక్టర్‌గా పనిచేస్తూ ప్రైవేటుగా చదువు కునేందుకు ప్రయత్నించాడు.. అయితే చెడు సావాసాలు వినయ్‌ శర్మను పక్కదారి పట్టించాయి.. నిర్భయ కేసులో ప్రధాన దోషికి తేలి తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న రామ్‌సింగ్‌ ఇంటికి దగ్గర్లోనే నివశించేవాడు వినయ్ శర్మ.... అతనితో కలిసి నిర్భయ జీవితాన్ని నాశనం చేశాడు.

 

గతంలో ఎప్పుడూ నేర చరిత్రలేని వినయ్ శర్మ...  2012 డిసెంబర్ 16న చేయకూడని తప్పు చేశాడు.  ఢిల్లీలో స్నేహితులతో కలిసి బస్సులో వెళ్తున్న నిర్భయపై స్నేహితులతో కలిసి దాడి చేశాడు. అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు.  రామ్‌ సింగ్‌, ఇతర స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం తాగిన వినయ్ శర్మ... ఆ క్షణం కర్కోటకుడిగా మారిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే... తనకు ఏ పాపం తెలియదని బుకాయించాడు... అసలు నిర్భయ అత్యాచారం జరిగిన రోజు తాను ఆ బస్సులో లేనని..  పవన్ గుప్తాతో కలిసి మ్యూజిక్ ఫంక్షన్‌కు వెళ్లినట్టు బుకాయించాడు... కానీ పోలీసులు సాక్ష్యాధారలతో నిరూపించేసరికి కోర్టు హాల్‌లో ఏడ్చేశాడు. 

 

ఘోరం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాప పడితే ఏంటి లాభం. తాను ఉరికంబం ఎక్కడం ఖాయమని తెలుసుకున్న తర్వాత కూడా బెయిల్ పై బయటకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు వినయ్ శర్మ. జైలు శిక్ష అనుభవిస్తూనే  చదువును కొనసాగించిన వినయ్ శర్మ.. యూనివర్శిటీ ఎగ్జామ్స్‌ రాసేందుకు నెల రోజులు బెయిల్ కావాలని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. అయితే నిర్భయ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. జైల్లోనే వినయ్ శర్మ పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసింది.

 

ఘోరం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాప పడితే ఏంటి లాభం. తాను ఉరికంబం ఎక్కడం ఖాయమని తెలుసుకున్న తర్వాత కూడా బెయిల్ పై బయటకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు వినయ్ శర్మ. జైలు శిక్ష అనుభవిస్తూనే  చదువును కొనసాగించిన వినయ్ శర్మ.. యూనివర్శిటీ ఎగ్జామ్స్‌ రాసేందుకు నెల రోజులు బెయిల్ కావాలని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. అయితే నిర్భయ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. జైల్లోనే వినయ్ శర్మ పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసింది. చివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉరికంబమైతే తప్పలేదు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: