దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి మెల్లమెల్లగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 200కి చేరింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. చైనా లో ఇప్పుడు ఈ వైరస్ ప్రభావం తక్కువ ఉన్నా.. ఇతర దేశాల్లో మాత్రం తీవ్ర రూపం దాలుస్తుంది. ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్ లో కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది.  మృతుల సంఖ్య అంతకంతగా పెరిగిపోతుంది. అయితే ఈ కరోనా మహమ్మారి మన దేశంంలో కూడా ప్రబలి పోతుంది. ఒకటీ రెండు అన్న సంఖ్యలో వందల కంఖ్యకు చేరుకుంది.

 

ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 169 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యసంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ముగ్గురు మరణించగా.. మరో 15 మంది వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జి అయినట్టు తెలిపింది.   తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ‘కరోనా’ కేసుల సంఖ్యల 18కి చేరింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, లండన్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకినట్టు తేలిందని అన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్లు  చెప్పారు.

 

తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో క్యాబ్ డ్రైవర్ కు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దాంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ లో ఇప్పటి వరకు కరోనా  సోకిన వారు విదేశాల నుంచి వచ్చినవారు.. అయితే లోకల్  గా ఈ వ్యాధి ప్రభావం లేదని అంటున్నారు.  ఒకవేళ బాధితుల సంఖ్య పెరిగితే ఏం చేయాలో కూడా తాము ఆలోచించామని, ‘కరోనా’ సోకితే అద్దె ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయిస్తారు కనుక, వేల మందిని క్వారంటైన్ చేయగలిగేలా సన్నద్ధం అయినట్టు అధికారులు వివరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: