వివాదాస్ప‌ద రాజ‌కీయ‌నాయ‌కుడిగా పేరుగాంచిన దెంద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ లాక్‌డౌన్ వేళ త‌న ఫాం హౌస్‌లో గుర్ర‌పుస్వారీ చేస్తున్నారు. ఈ వీడియో దృశ్యాల‌ను ఆయ‌న త‌న అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. క‌రోనా వేళ మాజీమంత్రి ఏమాత్రం త‌న హావాను త‌గ్గించుకోవ‌డం లేద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియాలో స‌ద‌రు వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉండ‌గా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ఎంతో ఆక్టివ్‌గా ఉంటున్నారు. 

 

క‌రోనా నివార‌ణ‌కు త‌న‌వంతుగా  మాస్కుల పంపిణీ, శానిటైజ‌ర్ల పంపిణీ చేప‌డుతున్నారు. పోలీసుల‌కు, బాట‌సారుల‌కు ఎన్టీఆర్‌, చింత‌మనేని జ‌న‌తా క్యాంటీన్ల ద్వారా టిఫిన్ల పంపిణీ వంటి కార్య‌క్ర‌మాలు కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం. సేవ చేయ‌డానికి మంచి మ‌న‌సు ఉంటే చాల‌ని..దానికి ఇంకేం అక్క‌ర్లేద‌ని చింత‌మ‌నేని చెప్పుకొస్తున్నారు. క‌రోనా వేళ కూడా త‌న గుర్ర‌పు స్వారీ దృశ్యాల‌తో మీడియాను, సోష‌ల్ మీడియాను త‌న వైపు తిప్పేసుకున్నారు ఈ మాజీ మంత్రి. ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రోజురోజుకు విజృంభిస్తోంది. అదుపులోకి వ‌స్తుంద‌ని భావించిన త‌రుణంలోనే మ‌ళ్లీ త‌న‌ప్ర‌తాపాన్ని చూపెడుతోంది.

 

సోమ‌వారం ఒక్క‌రోజే దాదాపు 77కొత్త కేసులు న‌మోదుకావ‌డంతో రాష్ట్ర యంత్రాంగం, వైద్యాధికారులు అల‌ర్ట్ అయ్యారు. ఇక క‌ర్నూలులో ప‌రిస్థితి అదుపుత‌ప్పిందా అన్న అనుమాన‌లు క‌లిగిస్తోంది. దాదాపు 180కేసుల‌కు పైగా న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. కరోనాను కట్టడి చెయ్యటానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా సరే ఏపీలో కేసులు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఏపీలో ఇప్పటి వరకు 722 కేసులు నమోదు కాగా 20 మంది మృతి చెందారు . కరోనా మహమ్మారిని కంట్రోల్ చెయ్యటానికి ఏపీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: