కరోనా లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించింది కేంద్రం. మే 17 వరకు మూడో దశ లాక్ డౌన్ ఉంటుందని కేంద్రం ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. కరోనా వైరస్ ప్రభావం దేశంలో తగ్గక పోవటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెడ్ జోన్ లను మినహాయించి గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో కొత్త సడలింపు ప్రకటిస్తూ మద్యం విక్రయాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసినదే. విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం కేంద్రం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న అనీ లాక్ డౌన్ నిబంధనలు మే 17 వరకు కొనసాగుతాయి. కంటోన్మెంట్ జోన్ లలో 100% లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి హట్ స్పాట్ కేంద్రాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు.

 

జోన్ లతో సంబంధం లేకుండా అంతర్ రాష్ట్ర రవాణా, విమాన, రైలు, బస్సు ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్కూల్స్, కాలేజి లు ఇతర అన్ని విద్యా సంస్థలు మే 17వరకు యధావిధిగా క్లోజ్ అయ్యే ఉంటాయి. అలాగే బహిరంగంగా ప్రజలు ఉండే ప్రదేశాలపై ఆధ్యాత్మిక ప్రదేశాలపై నిషేధం కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. కానీ రాత్రి పూర్తిస్థాయిలో కర్ఫ్యూ ఉంటుంది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా భయంకరంగా నష్టపోవడంతో జగన్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఈ విషయంలో మందుబాబులు చాలా టెన్షన్ పడుతున్నారు. మామూలుగానే తాను ముఖ్యమంత్రిగా వచ్చిన టైములో అనేక ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన కిక్ ఎక్కిస్తాడా .. దించేస్తాడా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరోపక్క జగన్ మాత్రం మే 17 తర్వాత  మాత్రమే మందు దుకాణాలు కి పర్మిషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: