కేసీయార్ మాటల మరాఠి. ఆయన మాటలు తూటాల్లా ఉంటాయి. ఎవరికి చేరాల్సింది వారికి ఒక కఠినమైన కచ్చితమైన  సందేశంగా చేరిపోతుంది. ఆ దెబ్బ తిన్న వారు కిక్కురుమనరు. తమ మీదనే బాణాలు వేశారని కూడా చెప్పుకోలేకుండానే కేసీయార్ వేసేస్తారు.

 

కేసీయార్ సుధీర్ఘమైన ప్రెస్ మీట్ ఎన్నో రికార్డులు స్రుష్టించింది. అంతేనా. ఆయన రాజకీయ మెరుపులకు తెలంగాణాలోకి విపక్షాలే  కాదు, ఏపీలోని విపక్షాలు కూడా షాక్ తిని షేక్ అయ్యారు. మీకు చావులు కావాలా అంటూ కేసీయార్ అడిగిన ప్రశ్న కేవలం తెలంగాణా విపక్షానికే అనుకుంటే పొరపాటు.

 

ఎంత దిక్కుమాలిన ప్రతిపక్షం మీరు. చావులు కోరుకుంటారా. అందరూ బాగుండాలని అనిపించదా అంటూ కేసీయార్ ప్రతిపక్షం మీద శరసంధానమే చేశారు. నిజానికి ఏపీలో టీడీపీ  ఇతర విపక్షాల ఏడుపు కూడా అదే కదా. ఏపీలో కేసులు తక్కువ చూపిస్తున్నారు. దాచేస్తున్నారు అంటూ తెల్లారిలేస్తే బాబు తో పాటు తమ్ముళ్ళు మీడియా మీద పడి రాగాలూ, దీర్ఘాలు తీసిన సంగతి తెలిసిందే.

 

మరో వైపు చూసుకుంటే కరోనా కట్టడికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా వివరిస్తూ ఈ దేశంలోనే మాస్కులు, కిట్లు ఎన్ని ఉన్నాయో కూడా అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు. అది బాబు లాంటి వారికి కూడా తెలిసేలా చెప్పారు. ఇక కరోనాతో కాపురం చేయాలని జగన్ మొన్న చెబితే ఎకసెక్కం ఆడిన పచ్చ పార్టీకి, ఆ మీడియాకు కూడా దిమ్మ తిరిగేలా కేసీయార్ అదే మాట వల్లె వేశారు. 

 

మొత్తం మీద చూసుకుంటే కేసీయర్ ఉమ్మడి ఏపీలోని ప్రతిపక్షాలకు బోధపడేలా గట్టిగానే క్లాస్ పీకారని అంటున్నారు. ఇక ప్రత్యేకంగా చెపాల్సింది వేరేది లేదని కూడా అంటున్నారు. అఖిల పక్షం మీటింగు మీద కేసీయార్ వేసిన జోకులు, విపక్షంలో ఎవరున్నారంటూ వేసిన సెటైర్లు కూడా జాతీయ పార్టీ తెలుగుదేశం భుజాలు తడుముకునేలా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి కేసీయార్ తాను మొనగాడినీ, మాటకారినీ అని మళ్ళీ నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: