అవునా..నిజమా..అంటే నిపుణులు అదే నిజం అంటున్నారు. ఎందుకంటే ఇది చెలగాటం. ప్రమాదంతో చెలగాటం. ప్రాణాలతో చెలగాటం. ఇష్టం వచ్చినట్లుగా చేస్తే కుదరదు, మిగిలిన వాటి మాదిరిగా ఉదాశీనత అసలు కుదరదు. ఈ విషయంపైనే ఇపుడు చర్చ సాగుతోంది. విశాఖలో ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ జరిగింది. అది ఒక శాంపిల్ మాత్రమేనని అంటున్నారు.

 

కరోనా నుంచి కాపాడుకోవాలంటూ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఇది దేశవ్యాప్త లాక్ డౌన్. దానివల్ల అన్ని రకాలైన పరిశ్రమలూ మూతపడ్డాయి. అయితే కెమికలు పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాల్సిఉందని అంటున్నారు. ఎందుకంటే అక్కడ విష వాయువులతో పని. వాటితోనే ఆపరేషన్లు. అందువల్ల కనీసం యాభై శాతం అయినా సిబ్బందితో ఆపరేషన్ చేసేందుకు వీలు ఇవ్వాలని గత నెలలో ఇండియన్  కెమికల్ కౌన్సిల్ కేంద్రానికి లేఖ రాసిందట.

 

దాని మీద కిమ్మనని కేంద్రం సడన్ గా గ్రీన్ జోన్లో  వ్యాప‌కాలు నిర్వహించుకోవచ్చునంటూ చెప్పుకొచ్చింది. దాంతో నలభై అయిదు రోజులుగా పనిచేయని ఈ రసాయన పరిశ్రమలు ఇపుడు ఒక్కసారిగా పనిచేయడం ప్రారంభించేసరికి గాస్ లీక్ అయింది. ఈ పరిణామాలు దేశంలో ప్రతీ చోటా జరుగుతున్నాయి. చత్తిస్ ఘడ్  కూడా  గ్యాస్ లీక్ ఘటన జరిగింది. 

 

ఇపుడు మరో పది రోజుల్లో లాక్ డౌన్ ఎత్తేస్తారనే అనుకుంటే దేశం మొత్తం మీద ఇలాంటి ఘటనలు చాలా జరిగేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది ప్రమాదాలతో చెలగాటం ఆడడమే కాదు, ప్రాణాలతో కూడా చెలగాటమేనని అంటున్నారు. కరోనాకు మందు వేయబోయి కొత్త ప్రమాదాలు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. కేంద్రం కెమికల్ పరిశ్రమల విషయంలో కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించకపోవడం, వాటి ప్రమాద తీవ్రతను అంచనా వేయకపోవడంతోనే ఈ రకమైన పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు.

 

ఇలా కేంద్రం తప్పు చేసిందన్న భావన సర్వత్రా  వ్యక్తం అవుతోంది. కానీ ఎక్కడికక్కడ రాష్ట్రాలు ఈ పాపాన్ని మోయాల్సివస్తోంది. కనీసం నష్ట పరిహారం విషయంలోనూ కేంద్ర స్థాయిలో స్పందించే అవకాశం కూడా కేంద్రం తీసుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: