ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో అనేక పరిశ్రమలు మూత పడటంతో వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వాళ్ల సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో చాలా మంది ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 

 


ఇక ఈ తరుణంలోనే ఒకరు మరో రకంగా ఆలోచించడం జరిగింది. తన భార్య లాక్ డౌన్ లో చిక్కుకున్న కారణంతో మరో అమ్మాయితో వివాహం చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని బరెలి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానికులు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... 2013 సంవత్సరంలో నయుమ్ మన్సూరీ అనే వ్యక్తితో నజిమ్ పెళ్లి జరిగింది. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇక లాక్ డౌన్ అమలు కాక ముందుకు మార్చ్ 19 న నజిమ్ తన తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లడం జరిగింది. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ అమలు అవ్వడంతో ఆమె అక్కడే చిక్కుకోవడం జరిగింది.  

 

 

ఇంతవరకు ఏముంది అనుకుంటున్నారా...? ఉండండి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది... అదేమిటంటే నయుమ్ మన్సూరీ తన భార్య ఇంటికి రావడం లేదు అన్న కోపంతో మరో బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న నజిమ్.. తనకు సహాయం చేయాలి అంటూ మేరా హాక్ అనే స్వచ్ఛంద సంస్థను సంప్రదించింది. దీనితో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఫర్హత్ నాక్  పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. అసలు ఏవిధంగా అలోచించి అతను మల్లి పెళ్లి చేసుకున్నాడో, పెళ్లి చేసుకున్న అమ్మాయి అసలు పెళ్లికి ఎలా ఒప్పుకుంది ఆ దేవుడికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: