ఎమ్మెల్యే అచ్చెం నాయుడును అదుపులోకి తీసుకునే ముందు  నాకు సమాచారం ఇచ్చార‌ని ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం మీడియాకు స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఎందుకు అరెస్టు చేస్తున్నాము,ఏ ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నామో ముందుగానే ఏసీబీ డీజీ, జైళ్ల శాఖ, సీఐయుయు నా దృష్టికి తీసుకొచ్చార‌ని తెలిపారు. అచ్చెన్నాయుడు విషయంలో నిబంధనలు ప్రకారమే అధికారులు వ్యవహరించారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు విషయంలో చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. నేరాలకు బీసీల‌కు సంబంధం ఏంటో తెలుగుదేశం పార్టీ నాయ‌కులే చెప్పాలి. అచ్చెన్నాయుడు బీసీ అయితే చేసిన నేరానికి వదిలేద్దామా ? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. నేరస్థుల‌కు అపాదించి ఆయా వర్గాలను అవమానిస్తున్నారంటూ పేర్కొన్నారు.

 

అచ్చెన్నాయుడు నేరం చెయ్యకపోతే నేరం ఎవరు చేశారో చంద్రబాబు చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈఎస్ఐ లో కుంభకోణం జరిగింది. ఇన్వెస్ట్గెటివ్ ఏజెన్సీలు ఏపీలో  ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తోంది. ఏసీబీ అధికారుల ఫండమెంటల్ డ్యూటీని  చంద్రబాబు రాజకీయాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. చేసిన నేరాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు బిసిల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడు ఎవరో ఏంటో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గా ఉన్న  నెరస్థుడిని పట్టుకొని స్వాతంత్ర్య సమర యోధుడుగా చిత్రీకరిస్తున్నారు.

 

అచ్చెన్నాయుడు నేరం విషయంలో గాంధీ,పూలే,అంబెడ్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలకు  ఏమి సంకేతం ఇస్తున్నారు. అచ్చెన్నాయుడు విషయంలో టీడీపీ చేస్తున్న ఆందోళనలు ఎస్సి, ఎస్టీ, బీసీలను అవమానించేలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు నేరంలో లోతుగా విచారణ చేస్తే మని లాండరింగ్ చట్టంలో 3,4 సెక్షన్లు    వర్తిస్తాయి. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి ఎవరి ఖాతాల్లో వేశారనే విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. టెక్కలి చెందిన గ్రానైట్ వ్యాపారులు పాత్ర ఉందని సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేగా  ఉన్న అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో వాస్తవాలు తెలియాలని స్పీకర్ గా మీ ముందుకు వచ్చాన్నంటూ ఆయ‌న వివ‌రించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: