రాష్ట్ర ప్రభుత్వం తీసు కొచ్చిన రైతు బంధు సంబంధించింది అటు  రైతులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రైతుబంధు సంబంధించి కేసీఆర్ సర్కార్ సరి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరో వారం  పది రోజుల్లో రైతుబంధు సొమ్ము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఇంతకు మునుపే ఈ ఆదేశాలు చేసినప్పటికీ తాజాగా ఈ రోజు మధ్యాహ్నం వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. 

 


 అయితే 2020 బడ్జెట్ ప్రతిపాదనలు సమయం లో జనవరి 23న సిసిఎల్ఏ లో  ఇచ్చిన వివరాల లోని పట్టాదారు లతోపాటు... అర్వోఎఫ్ఆర్  పట్టాదారులకు  కూడా ఈ రైతు బంధు ఖాతా లో జమ కానుంది. అంతే కాకుండా పెద్దపల్లి జిల్లా కాసుపల్లి లో  దేవాదాయ భూములు సాగుచేస్తున్న 221 మంది రైతులకు కూడా రైతుబంధు జమ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి సేకరించిన వివరాలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది తెలంగాణ. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్ కు భూముల వివరాల ను సేకరించనున్నట్లు  తెలుస్తోంది. అయితే అమ్మిన భూముల వివరాలను సేకరించి... వాటిని  రైతుబంధు జాబితా నుంచి తొలగించి... వచ్చే  ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పాస్ బుక్కులు  జారీ చేసి రైతు బంధు అందించనున్నారు . 

 


 అయితే తెలంగాణ రాష్ట్రంలో తొలకరి చినుకులు పలకరిస్తున్న  నేపథ్యంలో రైతులందరూ ఈ వర్షాల  కోసం ఎంతో ఆశగా  ఎదురుచూస్తున్నారు . ఇప్పటికే  అందరూ రైతులు పొలాల్లోకి దిగి పొలాలను  పంటలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో పలు జిల్లాలో భారీ మొత్తంలో పంటలు వేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: