అనుమానం పెనుభూతం ఒక్కసారి ఎవరిమీద అయినా అనుమానం మొదలయ్యింది అంటే చాలు. ఇక మళ్ళీ నమ్మకం కలగడం ఏర్పడాలంటే చాలా సమయమే పడుతుంది. ఇప్పడు అదే పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో మొదలయ్యింది. ఇప్పటికే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో, ఆయన బాటలో చాలా మంది ఎంపీలు ఉన్నారనే అనుమానం వైసీపీలో మొదలైంది. సుమారు పదిమంది వరకు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కొద్దిరోజులుగా మొదలవడంతో పెద్ద అలజడి రేగుతోంది. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు ఈ విధంగా హైలెట్ అవ్వడంతో ఆయన ఖండించారు. ఇటువంటి ప్రచారం చేస్తే కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. 

 


ఇక చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్క్ హయత్ హోటల్లో సుజనాచౌదరి, కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసినట్లు వార్తలు బయటకు రావడం, హోటల్ నుంచి స్వాధీనం చేసుకున్న సీసీ టీవీ పుటేజ్ లో కొంత మంది వైసీపీ ఎంపీలు, ఎమ్యెల్యేలు ఉన్నట్లుగా తేలడంతో వైసిపి అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజీలలో  ఉన్న వైసిపి నాయకులు ఎవరా అనే విషయం పార్టీ అధిష్టానం ఆరా తీసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తం ఈ వ్యవహారమంతా బిజెపి వెనకుండి నడిపిస్తుంది అనే అనుమానం ఇప్పుడు వైసీపీలో మొదలైంది. 

 

IHG's guidelines: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CM' target='_blank' title='cm-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cm</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS JAGAN MOHAN REDDY' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> - The New ...


అంతకు ముందు వరకు వైసిపి విషయంలో సానుకూలంగా ఉంటూ వచ్చిన బీజేపీ కొద్దిరోజులుగా వ్యతిరేకంగా ఉన్నట్టుగా స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, వైసీపీ ని టార్గెట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. జగన్ ప్రజా సంక్షేమ పథకాలు అమలు విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండడంతో, ప్రజల్లో మరింతగా ఆయనకు ఆదరణ పెరిగిపోతోందని, బలమైన నాయకుడిగా ఆయన తయారైతే ఏపీలో బీజేపీకి అవకాశం ఉండదనే అభిప్రాయంతో వైసీపీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వైసిపి కి చెందిన కొంత మంది ఎంపీలను తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోంది అనే అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: