జువాన్ జోస్ అనే 67 ఏళ్ల వ్యక్తి.. హై బ్లడ్ ప్రెషర్ తో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు రెండు గంటల తర్వాత వచ్చి.. జువాన్ జోస్ చనిపోయాడు అంటూ కుటుంబీకులకు తెలిపారు. కరోనా వైరస్ దృశ్య మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించలేమని దూరం నుంచి కడచూపులు చూసుకోవాలి అని చెప్పారు. ఈ క్రమంలోనే దూరం నుంచే వ్యక్తి మృతదేహాన్ని చూడగా... కదలికలు గమనించింది జువాన్ జోష్ కుమార్తె. తన తండ్రి బతికే ఉన్నాడు అంటూ వైద్యులతో వాదించింది . కానీ సదరు యువతి మాటలు మాత్రం వైద్యులు పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే జువాంగ్ జోస్ మృతదేహాన్ని మార్చురీ లో కి తీసుకెళ్లారు. ఇలాగే ఊరుకుంటే లాభం లేదు అనుకున్న జువాన్ జోస్ కుమార్తె ఏకంగా వైద్యులను పక్కకు నెట్టి మరి మార్చురీ లోకి వెళ్ళింది. తండ్రి మృతదేహాన్ని గట్టిగా కదిపింది. దీంతో ఒక్కసారిగా కళ్లు తెరిచిన ఆయన లేచి కూర్చున్నాడు. దీంతో అందరూ షాక్. చనిపోయాడు అనుకున్న వ్యక్తి లేచి కూర్చోవడంతో డాక్టర్లు సైతం అవాక్కయ్యారు... ఈ విషయం బయటకు పొక్కడంతో హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఉన్నతాధికారులు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి