డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ప్రెసిడెంట్. ఆయన రెండవసారి అధికారంలోకి వస్తారో లేదో అన్నది మరో ఇరవై రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికలు జరగనున్నాయి. బయటకు ఎన్ని చెప్పినా కూడా ట్రంప్ లో ఎక్కడలేని కంగారూ కనిపిస్తోంది. ఆయన ప్రచార సభలు వెలవెలపోతున్నాయి. మరో వైపు ప్రవాస భారతీయులు పూర్తిగా జో బైడెన్ ని సమర్ధిస్తున్నారు. ఆయనకు పెద్ద ఎత్తున ఎన్నికల విరాళాలు కూడా సమకూర్చి ప్రచారానికి తమ వంతుగా సాయం చేశారు. మొత్తానికి చూసుకుంటే ట్రంప్ ని ఇంటికి పంపడానికి అమెరికా సమాజం మొత్తం సిద్ధమైనట్లుగా అర్ధమవుతోంది.

అయితే ట్రంప్ ఓడాక అమెరికాలో ఉండను అంటున్నాడు. అది ఆయన సొంత బాధ. కానీ భారత్ సంగతేంటి. నాలుగేళ్ల పాటు భారత్ తో ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ నడిపి చివరి నిముషంలో అదే భారత్ ని ట్రంప్ విమర్శించారు. ఇక ఎన్నికల్లో ఆయన మళ్లీ వచ్చినా భారత్ పట్ల ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అదే ఆయన ఓడాక  జో బైడెన్ వస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ మరో ప్రధాన‌మైన చర్చ. అమెరికాతో భారత్ సంబంధాల్లో పెను మార్పులు వస్తాయా అన్నది కూడా చర్చగా ఉందిపుడు.


ట్రంప్ రెండవసారి కచ్చితంగా గెలుస్తాడని కరోనా ముందు వరకూ కూడా భారత్ నమ్ముతూ వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ఆయన‌కు పెద్ద పీట వేసి ఇండైరెక్ట్ ప్రచారం కూడా చేసిపెట్టింది. హౌడీ మోడీ అయినా నమస్తే ట్రంప్ అయినా కూడా అదంతా ఈ పెద్దన్నను గెలిపించడానికేనని అందరికీ తెలిసిందే. ఇక జో బైడెన్ వస్తే మాత్రం భారత్ కి కొత్త చిక్కులు తప్పవని అంటున్నారు. జో బైడెన్ అయితే వామ‌పక్ష భావాలు నిండుగా ఉన్న నాయకుడు అంటున్నారు. పైగా ఆయన చైనా వైపు కొంత మొగ్గుచూపుతారు అన్న మాట కూడా ఉంది. ఇపుడున్న పరిస్థితుల్లో సరిహద్దుల్లో  భారత్ చైనాల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. దాంతో ఆ మధ్య దాకా ట్రంప్ భారత్ వైపు నిలబడ్డారు, ఇపుడు జో బైడెన్ కనుక నెగ్గితే మాత్రం ఎంతో కొంత చైనా వైపే ఉంటారని అంటున్నారు. పైగా ట్రంప్ చూపిన అతి వినయం, అభిమానం కూడా భారత్ కొంప ముంచబోతున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: