తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త ప్రభావం చూపించే విధంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీకి అనుకున్న విధంగా పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ బలపడటం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేతల మీద ఎక్కువ ఫోకస్ చేసింది అనే వార్తలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.

పార్టీలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలను అదేవిధంగా మాజీ మంత్రులను పార్టీలోకి తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తుందని చాలా మంది వ్యాఖ్యలు చేశారు. దాని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంత మందిని తీసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి చాలా కష్టంగానే ఉన్నా పరిణామం. అయితే కొంతమంది అగ్రనేతలకు మాత్రం కాస్త ఎక్కువగానే ఆఫర్లు ఇస్తున్నట్టుగా సమాచారం. ప్రధానంగా మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ముషీరాబాద్ నియోజకవర్గంలో మంచి బలం ఉన్న సంగతి తెలిసిందే.

అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయనకు మేయర్ సీటు ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది. అంతేకాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకటవీరయ్య అదే విధంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యే లను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆహ్వానించే ప్రయత్నం చేస్తుంది. తుమ్మల నాగేశ్వర రావుకి ఏకంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పదవి ఆఫర్ కూడా ఇచ్చింది. మరి అవి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: