ఎన్నికలు వచ్చాయి అంటే చాలు అభ్యర్థులు ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎన్నో హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఎన్నికలు వచ్చాయి అంటే నాయకులందరూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో భారీగానే ఖర్చు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మొత్తంలో ఖర్చు పెట్టాలి అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల స్థాయిని బట్టి ఎన్నికల్లో పెట్టే ఖర్చు కూడా నిర్ణయిస్తూ ఉంటుంది కేంద్ర ఎన్నికల  సంఘం. ఇక కేంద్రం సూచించిన మేరకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. లేనిపక్షంలో చర్యలు తప్పవు అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఎన్నికల ఖర్చు విషయంలో సవరణ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... ఎన్నికల ఖర్చును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.



 దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయాన్ని సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ స్థానాలకు గానూ జరిగే ఎన్నికలకు 77 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించిన కేంద్ర ఎన్నికల సంఘం... అసెంబ్లీ స్థానాలకు గాను 30.80 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే గతంలో లోక్సభ స్థానాలకు 70 లక్షలు.. అసెంబ్లీ స్థానాలకు 28 లక్షల వరకు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు చేసుకునేందుకు వీలు ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఎన్ని  నిబంధనలు విధించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏ మేరకు ఖర్చు చేస్తారు అనేది అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: