భారత దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా  ఎంతో మంది పై పంజా విసురుతోంది. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న  విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది ప్రాణాలు తీయడమే కాదు... ఎంతోమందికి దుర్భర స్థితిని తీసుకొచ్చి ప్రాణాలు పోయినంత పని చేస్తుంది. కరోనా వైరస్ సోక  కుండానే ఎంతో మందికి దుర్భర స్థితి తీసుకొచ్చి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునే విధంగా పరిస్థితులు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే దేశంలో రోజురోజుకు శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో హృదయ విదారక ఘటన లు  తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో. కనీసం తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ప్రస్తుతం అన్లాక్ మార్గదర్శకాలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు సరైన ఉపాధి దొరక్క అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ఇలా ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసి  మనస్థాపం చెందేలా చేసి  చివరికి ఆత్మహత్యలే తమకు దారి అనే విధంగా పరిస్థితులు తీసుకొస్తుంది.



 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే దేశ భవిష్యత్తు కోసం ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కరోనా వైరస్ తో ఉపాధి కోల్పోయిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా దోమకొండ కు చెందిన పోతు కిషోర్ హైదరాబాదులో ఓ ప్రైవేట్ స్కూల్లో పిఇటి గా పనిచేస్తూ ఉండేవాడు. ఇక కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో స్వగ్రామానికి వచ్చాడు ఏడు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో గ్రామంలో కొన్ని అప్పులు చేశాడు. ఇక వాటిని తీర్చేందుకు వేరే మార్గం లేక చివరికి ఆత్మహత్య శరణ్యం అనుకుని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: