దసరా దీపావళి పండుగ నేపథ్యం లో ఎంతో మంది ఉద్యోగం వ్యాపారం లేదా ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల కు వెళ్లిన వారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ముఖ్యం గా తెలుగు రాష్ట్రాల్లో  వివిధ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల కు వచ్చి స్థిరపడిన వారు పండుగల నేపథ్యం లో ఎక్కువగా బయలుదేరుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా పండుగల కు ఎంతో మంది సొంతూళ్ల కు వెళుతుంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇలా పండుగ సీజన్లో సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీస్ అధికారులు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొంగల బెడద ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని సూచిస్తున్నారు. సాధారణంగానే  ఇంటికి తాళం కనిపిస్తేచాలు కన్నం వేసే  దొంగలు..  రోజుల తరబడి పండుగలకు సొంతూళ్లకు వెళ్తున్న తరుణంలో దొంగలు చోరీలకు పాల్పడే  అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.



 ఈ క్రమంలోనే సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేశారు. బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయిన ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యల్లో  భాగంగా తమ  వివరాలను కూడా పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి వెళ్లడం ఎంతో మంచిది అంటూ సూచించారు.  ముఖ్యంగా నగర శివార్లలో ఉండే ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువైపోయిన తరుణంలో... పండక్కి ఊరెళ్ళే  వారు ముందు జాగ్రత్త చర్యగా సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటారు అంటూ పోలీసు అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: