తెలంగాణలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది.. కళ్లు మూసుకొని తెరిచేలోగా నేరాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ గా ఉన్నా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో పోలీసుల ఊహాకందని నేరాలు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు, మరోవైపు కిడ్నాప్ లతో నగరం అట్టడుకి పోతుంది. వరుసగా నగరంలో జరుగుతున్న కిడ్నాప్ లతో హైదరాబాదీలు భయంతో వణుకుతున్నారు. మొన్న మహబూబ్ నగర్ లో జరిగిన దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ , హత్య కేసు మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది.



వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన ములుగు జిల్లాలో జరిగింది.జిల్లాలోని వెంకటాపురం మండలం సీనీఫక్కీలో నాలుగు నెలల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. బాబు ఏడ్పు వినపడతంతో స్థానికులు అలెర్ట్ అయ్యి కిడ్నాపర్ల చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత తెలివిగా ప్రవర్తించారు. కిడ్నాపర్ల ను , వాహనాన్ని, చిన్న పిల్లాడిని పోలీసులకు అప్పగించారు. దీని వెనుక గల కారణాలను పోలీసులు వెతికే పనిలో పడ్డారు.



నాలుగు నెలలక్రితం నాగేశ్వరీ అనే మహిళ బాలుడిని దత్తత తీసుకుంది. గత రాత్రి ఎనిమిది మంది వచ్చి తలుపు కొట్టారు. ఆమె కళ్ళల్లో కారం కొట్టి పసిపిల్లాడిని ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యోగితా నగర్ గ్రామం వద్ద వాహనాన్ని పట్టుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ దంపతులు నాగేశ్వరిని ఆశ్రయించారు. అయితే వారికి బిడ్డ పుట్టే వరకు అన్నీ తానై చూసుకుంది. అనంతరం వారి ఇంట్లో వాళ్ళు బిడ్డను వద్దనడంతో బిడ్డను నాగేశ్వరికి ఇచ్చారు. ఆ బిడ్డను నిన్న రాత్రి ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు నాగేశ్వరి పోలీసులకు తెలిపారు. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: