రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ నేతల పరిస్థితి కూడా అలానే తయారవడం ఇప్పుడు టీడీపీ ని కలవర పెడుతుంది. చంద్రబాబు వృద్ధుడు కావడంతో పార్టీ ని నడిపించే నాయకుడు లేకపోవడంతో తమ్ముళ్లు కొంత అయోమయానికి గురవుతున్నారు..  పార్టీ లో ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడం తో పాటు టీడీపీ నేతలు కూడా మిన్నకుండి పోవడం తో టీడీపీ భవిష్యత్ ఎలా ఉంటుందో అని వాపోతున్నారు.. ఇప్పటికే కొన్ని నియామకాలు, పార్టీ అధ్యక్షుడు మార్పు వంటివి ప్రజల్లోకి వెళ్లినా దాంతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తమ్ముళ్లు ఏం చేస్తే పార్టీ మళ్ళీ ఫామ్లోకి వస్తుంది ని మల్లగుల్లాలు పడుతున్నారు..

ఇక పార్టీ లోని చినబాబు, పెదబాబు లు మాత్రమే టీడీపీ కొంత హుషారుగా ఉండేందుకు కృషి చేతున్నారు.. అది కూడా సోషల్ మీడియా లోనే.. ఓడిపోయిన తరువాత వీరు ఎక్కువగా ట్విట్టర్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రజలు కూడా వారిని అలానే ఫాలో అవడం మొదలుపెట్టారు.. అయితే ఇలా ఫాలో అయితే వ్యూస్ వస్తాయి తప్ప వర్గేడెం ఉందని అని టీడీపీ నేతలు కొంతమంది అంటున్నారు.. ప్రజల్లోకి వచ్చి ఏదోకటి చేయకపోతే టీడీపీ కనుమరుగయిపోతుందని అన్నారు.. దాంతో చంద్రబాబు లో భయం పుట్టి లోకేష్ ని ప్రజల్లోకి పంపిస్తున్నారు.. ఇప్పటికే కొన్ని చోట్ల లోకేశ్వరుడు తన మార్క్ స్పీచ్ ని ఇచ్చి ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు..

తాజాగా కోస్తా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసిన ఓ విమ‌ర్శ చివ‌రికి టీడీపీ శ్రేణుల్నే ముక్కున వేలేసుకునేలా చేసింది.  పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశారని లోకేశ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారో లేదో పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయ‌న నిలదీశారు.చివ‌రికి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఎన్‌డీఏ నుంచి బ‌య‌టికొచ్చి ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోస‌మంటూ కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ...ఆ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్‌తో కలిసి చంద్ర‌బాబు సుడిగాలి పర్య‌ట‌న‌లు చేశారు. ఇప్పుడు వైసీపీని పిల్ల కాంగ్రెస్ అని లోకేశ్ మాట్లాడ్డం సొంత పార్టీ శ్రేణుల‌కే విడ్డూర‌మ‌నిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: