ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల ప్రకటనని కరోనా రాక ముందే ప్రకటనని ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ఎస్ఈసీ రమేష్ కుమార్ విడుదల చేసారు . ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్  ని సైతం విడుదల చేసిన కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది . అయితే మూడు రాజధానుల బిల్ పాస్ చేసినట్టు .ఇప్పుడు ఆంద్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహం అందరిలో ఉంది.  అయితే దీనిపై ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది .అయితే ఈ స్థానిక సంస్థల నిర్వహణపై బుధవారం సమావేశమయ్యారు .ఈ  సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్నితో రాష్త్ర ఎస్ఈసీ భేటీ అయ్యారు అందులో భాగంగా సీఎస్  నీలం సాహ్ని ప్రభుత్వం తరఫున నివేదిక నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు అందజేశారు.

రాష్ట్రంలో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమని ప్రభుత్వం నివేదికలో స్పష్టం చేసింది. ప్రతి రోజూ సుమారు 3 వేల కోవిడ్‌ 19 కేసులు నమోదవుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది.

అలాగే ఎన్నికల నిర్వహణకు కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు మరియు  పోలీసులు కూడా  చాలా మంది కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోకి రాగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలా లేదా అప్పటి పరిస్థితి బట్టి ఎలా నిర్వహించాలి అనే దానిపై మేము ‌ఈసీని సంప్రదిస్తామని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది .

కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో రమేశ్‌కుమార్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న.నేపథ్యంలో మన ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతివ్వలంటూ  దీనిపై  ఒక అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది. ఇప్పట్లో స్థానిక ఎన్నికల నిర్వహణ గురించి  పార్టీల అభిప్రాయాలు చాలా ముఖ్యమని అందరి  అభిప్రాయాలను గౌరవిస్తామని రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: