ఈ మధ్య కాలంలో ప్రతి రంగంలో కూడా అక్రమాలు పెరిగిపోతున్నాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో అయితే లంచం ఇవ్వనిదే పనికాదు అని ఎంతోమంది ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివి కేవలం ఆరోపణలతో మాత్రమే ఆగిపోవు  కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఎంతో మంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ కూడా అధికారులకు దొరికిపోయిన ఘటన కలకలం సృష్టిస్తాయి అన్న  విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఘటనలు తెర మీదికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ లంచాలు తీసుకునే  అధికారులు ఎక్కువై పోతున్నారు అని ప్రజలు భావిస్తూ ఉంటారు.



 అయితే లంచాలు ఎవరికీ తెలియకుండా ఎంతో రహస్యంగా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ పొరపాటున అధికారులకు దొరికితే మాత్రం ఉద్యోగం పోవడంతో పాటు అప్పటి వరకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అన్ని మంటగలిసి పోతుంటాయి  అనే విషయం తెలిసిందే. ఇంత తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడానికి వెనకడుగు వేయరు కొంతమంది. ఇక లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరం అన్న విషయం తెలిసిందే. అందుకే లంచం ఇవ్వాలి అనుకున్న వాళ్ళని కూడా అరెస్టు చేస్తూ ఉంటారు పోలీసులు.




 ఇటీవలే ఓ భారతీయ ఉన్నతాధికారికి 10 లక్షల లంచం ఇచ్చింది అమెరికాకు చెందిన మద్యం తయారీ సంస్థ. విచారణలో ఈ విషయం బయటకు పొక్కడంతో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏకంగా 10 లక్షల లంచం ఇచ్చినందుకు గాను ఆ మద్యం తయారీ సంస్థకు 145 కోట్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.  అమెరికాలోని చికాగో కు చెందిన భీమ్ సన్ ట్రాయ్  సంస్థ భీమ్ ఇండియా పేరుతో రాజస్థాన్ లో మద్యం తయారీ కంపెనీ నడుపుతోంది.  ఈ కంపెనీకి సంబంధించిన అనుమతుల కోసం ఏకంగా ప్రభుత్వ అధికారికి 10 లక్షల లంచం ఇచ్చినట్లు విచారణలో తేలింది.  దీంతో అక్కడి న్యాయశాఖ ఏకంగా పది లక్షల లంచం ఇచ్చినందుకు గాను 145 కోట్ల జరిమానా విధిస్తూ కంపెనీ కి భారీ షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: