క్యాలండర్ లో సంవత్సరాలు ఇంతలా హడలెత్తించిన సంఘటనలు చరిత్రలో పెద్దగా లేవేమో. 2020 మ్యాజిక్ నంబర్ అని అంతా ఈ ఏడాది మొదట్లో సుస్వాగతం పలికారు. కానీ మొదటి నెల గడవకుండానే జనవరి 30న భారత్ కి కరోనా వైరస్ వచ్చి బెంబేలెత్తించింది.  అంతకు ముందే ప్రపంచానికి కరోనా తన రుచి ఏమిటో  చూపించింది. ఇక యూరోపియన్ దేశాల సంగతి అయితే చెప్పనవసరం లేదు. కరోనా తో విలయాన్నే చూశాయి. ఇక భారత్ లో మార్చి నుంచి మెల్లగా కదలిన కరోనా తన దూకుడు పెంచుతూ ఇప్పటికీ దేశాన్ని వణికిస్తూనే ఉంది. ఎందుకొచ్చిన 2020 రా బాబూ అని అంతా అనుకుంటున్నారు.

ఎంత వేగంగా ఈ ఏడాది ముగిస్తే అంత మంచిదని కూడా సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు. సరే మరో రెండు నెలలు గట్టిగా బిగించి ఈ ఏడాది  ఉంది. జనం కూడా ఉగ్గబట్టి ఊపిరి బిగబట్టి 2021 కోసం చూస్తున్నారు. కరోనా తగ్గుతుందని, వ్యాక్సిన్ వస్తుందని కూడా వారు ఆశలు పెట్టుకుంటున్నారు. ఇంతలో జపాన్ కి చెందిన ఓ అధ్యయనం భారత్ లో కరోనాను మించిన ప్రళయం ఒకటి పొంచి ఉందని చెబుతోంది. అది కూడా ఈ ఏడాది అంతంలోగా సంభవిస్తుందని కూడా పేర్కొంటోంది.

ఇంతకీ అదేంటి అంటే జర్నల్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ వారు చేసిన అధ్యయనం ప్రకారం హిమాలయాల్లో అతి పెద్ద భూకంపం వస్తుందిట. దాని వల్ల ఇటు భారత దేశం, అటు పాకిస్థాన్ కూడా నానా విధాలుగా నాశనం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ముందు మన భారత్ ని తీసుకుంటే హిమాలయాలను అనుకుని ఉన్న డెహ్రాడూన్ తో పాటు, చండీగడ్, నేపాల్ లోని ఖాట్మాండు వంటి మహా నగరాలకు ఈ భూకంపం ముప్పు ఉందని ఈ అధ్యయనకర్తలు తేలుస్తున్నారు.

గతంలో కూడా ఢిల్లీ చుట్టుపక్కల, ఉత్తర భారతాన భారీ భూకంపాలు ఏర్పడినపుడు దాని తాలూకా భూకంప కేంద్ర బిందువు హిమాలయాల్లోనే ఉందని కూడా గుర్తుచేస్తున్నారు. దీంతో ఉత్తర భారతన జనాల్లో కొత్త వణుకు మొదలైంది. 2020 పోతూ పోతూ కూడా అతి పెద్ద ముప్పుని దేశం మీదకు వదులుతుందా అన్న బెంగతో అంతా అల్లల్లాడుతున్నారు.  అలా జరగకూడద‌ని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: