భారత్ చైనా సరిహద్దుల్లో చైనా సృష్టించిన ఉద్రిక్తత పుణ్యమా అని రోజురోజుకు భారతదేశంలో స్వదేశీ వస్తువుల వాడకం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. క్రమక్రమంగా స్వదేశీ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ పండుగలకు సంబంధించి చైనా నుంచి దిగుమతి చేసుకొనే  అన్ని రకాల వస్తువులను నిషేధిస్తుంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే  స్వదేశంలో ఆయా వస్తువుల తయారీలో ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే రాఖీ పండుగ సందర్భంగా చైనా నుంచి ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోలేదు. దీంతో స్వదేశీ వస్తువుల వినియోగంలో  భారత్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో సాధారణంగా అయితే చైనా నుంచి దీపాలు అగ్గిపెట్టెలు టపాసులు లాంటివి ఎన్నో దిగుమతి అవుతూ  ఉంటాయి.



 కానీ ఈసారి మాత్రం భారత ప్రభుత్వం భారత్-చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త నేపథ్యంలో చైనా కు సంబంధించిన ఎలాంటి వస్తువులను కూడా దిగుమతి  చేసుకునేందుకు మొగ్గు చూపడం లేదు ఈ క్రమంలోనే... చైనాతో తలెత్తిన వివాదాన్ని కాస్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాగా వాడుకుంటున్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులను నిషేధించిన నేపథ్యంలో ఆయా వస్తువులను ఉత్తరప్రదేశ్లో తయారు చేయించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు



 కళాకారులతో పెద్ద ఎత్తున మట్టి వెదురుతో తయారు చేసినటువంటి దీపాలను అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని పాట్నా వారణాసి ఢిల్లీ తదితర నగరాలకు.. బీహార్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు అమెరికా నైజీరియా దుబాయ్ తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇక పండుగ నేపథ్యంలో ఆయా వస్తువుల విక్రయాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏకంగా  ఒకే జిల్లాలో 1500 గ్రూపులకు పైగా ఈ వస్తువులను తయారు చేసేందుకు ప్రతిరోజు పని చేస్తున్నారు. ఇలా చైనా తో ఉద్రిక్తతను యోగి బాగా యూస్ చేసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: