తెలంగాణ లో కేసీఆర్ పాలనా ఇప్పటివరకు ఒకలా ఉండగా ఇప్పటినుంచి ఒకలా అందబోతుందని తెలుస్తుంది.. ఇన్ని రోజులు కేసీఆర్ కి ఎదురులేదు.. ప్రతిపక్ష నాయకులూ కూడా అంతంత మాత్రంగా నే ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట అయిపోయింది.. కానీ ఇప్పుడు బీజేపీ కేసీఆర్ కి సరైన ప్రత్యగా కనిపిస్తుంది.. ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు గెలవగా ఇటీవలే దుబ్బాకలోనూ కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చింది..ఈ గెలుపులతో బీజేపీ కి కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. ఎప్పటినుంచి తెలంగాణ లో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది.. దానికి తోడు బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు..

కేంద్రం కూడా కేంద్రంలో తెలంగాణ బీజేపీ సభ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో మార్పుకు కారణం.. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా చేసి ప్రజల్లో బీజేపీ పై నమ్మకం పెరిగేలా చేసింది.. ఇకపోతే కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ లో ఏ తప్పు జరిగినా అది గత పాలకుల ఘనకార్యం అంటారు.. కేంద్రంలోని ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటారు. ఇటీవలే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ లను కలిపి ఏకిపారేశారు.

ఎల్ఐసిని అమ్మాల్సిన అవసరం ఏమి వచ్చింది అని నిలదీశారు. బీఎస్ఎన్ఎల్ ను ఎవరి ప్రయోజనాల కోసం దెబ్బతీశారు అని నిలదీశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే ఆ రెండు పార్టీలు సంపద సృష్టించటంలో విఫలం అయ్యాయి అన్నారు. లాభాల్లో ఉన్న ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ సంస్థలకి కట్టబెట్టారు. ఇది వారి అసమర్ధత కాదా అని ప్రశ్నించారు. అయితే ఇన్నినీతులు చెప్తున్నా కేసీఆర్ ఎవరిని అడిగి  తెలంగాణా బడ్జెట్ అవసరాల కోసం హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములను భారీ ఎత్తున అమ్మాలని నిర్ణయం కూడా తీసుకున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు పెంచుకోవటం కోసం ప్రజలకి ఉచిత హామీలిస్తూ ప్రజలని బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడి సంపాదించుకునే అవకాశాల్ని పెంచాల్సిన నాయకులు ఉచిత హామీలిస్తూ ప్రజలని సోమరిపోతులుగా చేస్తున్నారు. అంటున్నారు. మరి దీనికి కేసీఆర్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: