జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం లో ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అందరూ అభ్యర్థులు కూడా ప్రజల చెంత  వాలి పోయారు ఇప్పటికే ప్రచారానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం లో ఓటర్లను ఆకట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు. ముఖ్యంగా ఇటీవలి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ జిహెచ్ఎంసి ఎన్నికలు ప్రస్తుతం ఎంతో తలమానికంగా మారింది అనే విషయం తెలిసిందే.  దీంతో జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించడంతో పాటు ముమ్మర ప్రచారం చేస్తుంది.



 ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న డివిజన్ల లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ తమ కే ఓటు వేయాలని తాము అధికారం లోకి వస్తే డివిజన్ అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గం లోని 141 డివిజన్ పరిధిలో ఇందిరా నెహ్రూ నగర్,  ఏకలవ్య నగర్... స్థానిక టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు హుస్నాబాద్ నుంచి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నాయకుల తో కలిసి టిఆర్ఎస్ అభ్యర్థి తరఫున మద్దతుగా ప్రచారం నిర్వహించారు.



 ఈ క్రమంలోనే పలు కాలనీలలో ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ను గెలిపించాలని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిన టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందని మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అంటూ ఈ సందర్భంగా కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: