గ్రేటర్ ఎన్నికల పోరు ఎంతో గ్రేట్ గా కొనసాగుతోంది. రాజకీయరంగంలో మునుపెన్నడూ చూడని ప్రతిష్ఠాత్మక మార్పులు చేర్పులతో జిహెచ్ఎంసి ఎన్నికల రణ రంగం ఓ వైపు ఉరుములు మరో వైపు మెరుపులు అన్నట్టుగా దగదగ మెరిసిపోతున్నది. జరగబోతున్నది గ్రేటర్ ఎన్నికలా లేక దేశ ప్రధాన ఎన్నికలా అన్నట్టుగా రాజకీయ నాయకుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. అధికారంలో ఉన్న పార్టీకి మరింత బలం చేకూర్చేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే.... తమ పార్టీ ఆధిక్యతను చూపించేందుకు మరొకరు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం జరుగుతున్న వార్ కి ఓడితే ఓ లెక్క గెలిస్తే మరో లెక్క ఉంది అందుకే విజయం కోసం పార్టీ నేతలు అంతగా తహతహలాడుతున్నారు.

ఐదు లోక్‌సభ స్థానాలు… 24 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 150 డివిజన్ల సమూహమే గ్రేటర్‌ హైదరాబాద్‌. తెలంగాణకు రాజధాని. లక్ష్మీ కటాక్ష నగరం. అయితే గ్రేటర్ ఎన్నికల ఫలిత ప్రభావం నేరుగా అసెంబ్లీపై పడుతుందని అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అందుకే గెలుపుకోసం ఇంతగా ఆసక్తి చూపుతున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో షాక్ తిన్న అధికార పార్టీ కూడా ప్రజలకు తమ పార్టీపై నమ్మకం పోలేదు అన్న విషయంపై ఓ క్లారిటీ ఇవ్వాలి అంటే ..  గ్రేటర్ ఎన్నికలు ఎంతగానో సహాయపడతాయి. అందుకనే ఇంతగా ఆసక్తి కనబరుస్తున్నాయి. అటు దుబ్బాక ఎన్నికలతో మరింత జోరందుకున్న బిజెపి గ్రేటర్ ఎన్నికలను టార్గెట్ చేసి. ఇలా ఒకరికి మించి ఒకరు రాజకీయ లక్ష్యాల కోసం... వ్యూహాలు రచిస్తూ గ్రేటర్ ఎన్నికల్ని వేడెక్కిస్తున్నారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తున్నాయి...అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడింది. దుబ్బాకలో డిపాజిట్ రాని పరిస్థితి. దుబ్బాకలో బీజేపీ గెలుపు… అధికార టీఆర్ఎస్ ఓటమి.. కాంగ్రెస్ పార్టీకి సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సంజీవని మూలికలు వంటివి... ఈ గెలుపు వారి పార్టీకి సరికొత్త మలుపు చూపిస్తుంది కాబట్టి... కాంగ్రెస్కు గ్రేటర్ గెలుపు అత్యవసరం అందుకనే ఎన్నికల సందర్భంగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలా రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: