రాజకీయ పార్టీలు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి.. ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. .

అయితే ప్రదాన పార్టీల నేతలు ఉదయాన్నే వచ్చి తమ ఓటు వినియోగించుకున్నారు..మంత్రి కేటీఆర్‌ దంపతులు ఓటుహక్కును బంజారాహిల్స్‌లోని నందినగర్‌ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో వినియోగించుకున్నారు. ఓటువేసి బయటకువచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ..

 ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాద్యత అని,ఓటు వినియోగించుకున్న వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని కేటీఆర్‌ అన్నారు.అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన కుటుంబంతో వచ్చి ఓటు వినియోగించుకున్నారు.ఆయన మాట్లాడుతూ..దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: