ప్రస్తుతం పాకిస్తాన్ లో వాతావరణం హాట్ హాట్ గా మారిపోయింది. దీనికి కారణం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ వైపు ఐఎస్ఐతో మరోవైపు సైన్యంతో వరుసగా సమావేశం అవుతూ ఉండడంతో ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. వరుసగా రెండు రోజుల పాటు ఇమ్రాన్ ఖాన్ ఐఎస్ఐ, సైన్యం తో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇటీవలే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారా  అనే అనుమానాలు కూడా తెర మీదికి వచ్చాయి. కానీ అసలు విషయం మరొకటి అన్నది విశ్లేషకులు చెబుతున్నారు.



 ప్రస్తుతం చైనా కు బానిస గా మారిపోయిన పాకిస్తాన్ తీరుతో విసిగి పోయిన ప్రతిపక్షాలు ఒక్కటై ప్రస్తుతం ఉద్యమాలు చేపడుతూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు చేపడుతున్న ర్యాలీలకు  అటు ప్రజల నుంచి కూడా పూర్తిగా మద్దతు లభిస్తుంది. దీంతో ప్రతి ర్యాలీ  కూడా విజయవంతం అవుతుంది. ఒకప్పుడు బద్ద  శత్రువులు గా ఉన్నటువంటి నవాజ్,  భుట్టో కుటుంబాలు ఒకటై ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు 4 ర్యాలీలు నిర్వహించగా 4 కూడా పూర్తిగా విజయవంతం అయ్యాయి. ఇటీవలే ముల్తాన్ లో ర్యాలీ కి  కూడా ప్రజల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది.




 రోజు రోజుకు దేశవ్యాప్తంగా ఇమ్రాన్ వ్యతిరేక నిరసనలు మిన్నంటి  పోతున్నాయి. ఇక ఇలా ప్రతిపక్షాల నిరసనలకు సైన్యంలోని ఒక వర్గం ఐ ఎస్ ఐ లోని ఒక వర్గం కూడా సహకరిస్తుంది అన్న వాదన ఉంది. ప్రస్తుతం చైనా చెప్పుచేతుల్లో ఇమ్రాన్ ఖాన్ ఉండడంతో ప్రజా తిరుగుబాటు జరుగుతున్నది.  ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పాకిస్తాన్లో మరింత క్లిష్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అటు సైన్యాన్ని ఇటు ఐ ఎస్ ఐ ని కూడా శాంత పరిచేందుకు ఇమ్రాన్ ఖాన్ వరుసగా సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: