ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ల తో మాట్లాడుతూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరెందర్ సింగ్ ను టార్గెట్ చేశారు. అమరెందర్ సింగ్ భాజపా నేతలతో చేతులు కలిపాడని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు పనిచేస్తున్నాడని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కంట్రోల్ లో పనిచేస్తున్నారని అన్నారు.

అమరెందర్ సింగ్ తనపై నల్ల చట్టాలు చేసిన ప్రభుత్వం గా ముద్ర వేస్తున్నారని ఇలాంటి చిల్లర రాజకీయాలు తనకు తగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.నల్ల చట్టాలు చేసింది కేంద్ర ప్రభుత్వం అని వారిని ఏమి అనలేక మా ప్రభుత్వాన్ని అంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ లో తొమ్మిది స్టేడియo లను జైలు గా మారుస్తున్నారని చెప్పిన అమరెందర్ సింగ్ వాటిని నిరూపించాలని అన్నారు.

అలాగే మేము దానిని వ్యతిరేకించామని కేంద్ర ప్రభుత్వo వాటిని ఏర్పాటు చేసి రైతులను ఆ జైలులో వేయాలని చూస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం మరియు అమరెందర్ సింగ్ ప్రభుత్వం కలిసి రైతులను మోసం చేస్తున్నారని కేజ్రివాల్ ఆరోపించారు. ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా వైరస్ ను ఢిల్లీ లో అడ్డుకోలేదని ప్రజలను పట్టించుకోవడం లేదని ప్రజలను గాలికి వదిలేశారని సరైన మెడికల్ సదుపాయాలను అందించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: