గ్రేటర్ ఎన్నికలు మొత్తానికి 150 డివిజన్లలో విజయవంతంగా పోలింగ్ ను పూర్తి చేసుకుంది.. ఇక ఎన్నికల ఫలితాల పై అందరి కన్ను పడింది.రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై రాజకీయ నేతలతో పాటుగా జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఉత్కంఠ గా పోలింగ్ జరిపినా. కూడా తక్కువ సంఖ్యలో ఎన్నికల ఓటింగ్ ను నమోదు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ ఎన్నికల్లో ఎవరు ఆధిపత్యం వహిస్తారు అనేది ఆసక్తిగా మారింది..ఇకపోతే ఆ తరుణం వచ్చేసింది.. 



రేపు ఎన్నికల లెక్కింపును అధికారులు ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది..ఇప్పటికే కౌంటింగ్ చేస్తున్న ప్రాంతాలలో ఫుల్ బందోబస్తు తో పాటుగా జట్టు దిట్టమైన చర్యలను కూడా తీసుకున్నారు.. కాగా, ఉదయం 11 గంటలకు ఎన్నికల లెక్కింపు అధికారుల తో ఎన్నికల కమీషనర్ భేటీ కానున్నారు.. అనంతరం ఓట్ల లెక్కింపు ను ప్రారంభించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం టీఆరెఎస్ ప్రభుత్వం లీడింగ్ లో ఉందని తెలుస్తుంది.ఇకపోతే పీపుల్ పోల్స్ కూడా అదే చెప్తున్నాయి..



ఈ మేరకు జిహెచ్ఎంసి సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది.1 హల్ కి 14 టేబుల్స్ ఉంటాయి.ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 815231 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు..కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు
 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపును చేస్తున్నారు.. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది..ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు.బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు.మొదట మెహిదీపట్నం, చివరగా మైలార్ దేవ్ పల్లి డివిజన్ల ఫలితాలు వెలువడనున్నాయి..గెలుపు ఎవరిదో రేపు తెలిసి పోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: